ఏపిలో కొత్తగా 1062 పాజిటివ్ కేసులు

మొత్తం కేసుల సంఖ్య 22,259

ఏపిలో కొత్తగా 1062 పాజిటివ్ కేసులు
corona virus – ap

అమరావతి: ఏపిలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో 12 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 264కి పెరిగింది. కొత్తగా 1062 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 22,259కి చేరింది. 11,101 మంది డిశ్చార్జి కాగా, 10,894 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 255 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 173, తూర్పు గోదావరి జిల్లాలో 125 కేసులు నమోదయ్యాయి.

ఏపిలో కొత్తగా 1062 పాజిటివ్ కేసులు


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/