102 షూటింగ్‌ మొదలుపెట్టనున్న బాలయ్య

Balaiah
Balaiah

 

102 షూటింగ్‌ మొదలుపెట్టనున్న బాలయ్య

100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణితో మర్చిపోలేని విజయాన్నందుకున్న బాలయ్య ఆ తర్వాత 101, 102 చిత్రాలను వెంటనే ప్రకటించేశారు.. వాటిలో పూరిజగన్నాధ్‌ డైరెక్టు చేస్తున్న 101 వచిత్రం ఇప్పటికే మొదలై చాలావరకు షూటింగ్‌ కూడ పూర్తిచేసుకుంది.. 102వ సినిమాను సీనియర్‌ దర్శకుడు కె.ఎస్‌.రవికమార్‌ దర్శకత్వం వహించనున్నారు. కొంత కాలం క్రితమే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈసినిమా రెగ్యులర్‌షూటింగ్‌ ఆగస్టు రెండోవారం నుంచి కుంభకోణంలో మొదలుకానుందని తెలిసింది.. 40 రోజులపాటు జరగబోయే ఈ షెడ్యూల్‌లో బాలయ్య మొదటి రోజు నుంచి పాల్గొంటారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ నయనతార నటించనున్నారు.. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్న ఈసినిమాకు టైటిల్‌, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.