1016 చివర్లో రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభిస్తాం: సుబ్రమణ్యస్వామి

చెన్నై : బీజేపీ సీనియర్‌నేత సుబ్రమణ్యస్వామి రామ మం దిరం నిర్మాణంపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం రామ మందిరం నిర్మాణంపై ఆగస్టు-సెప్టెంబరులో సుప్రీంకోర్టు తన తీర్పును వెలువ రించనున్న నేపథ్యంలో హిందువులు-ముస్లింలు పరస్పర అంగీకారంతో ఈ ఏడాది చివర్లో రామమందిరం నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని సుబ్రహ్మణ్య స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. ఖచ్ఛితంగా 2016 చివర్లోపు రామాలయాన్ని అయోధ్య లో నిర్మిస్తామని, అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులకోసం వేచిచూస్తున్నట్లు సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు.2017లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ వాఖ్యలు చేయలేదని, ఎన్నికలు, రాముని ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాముడు హిందువుల మనస్సుల్లో ఉన్నాడని, ఆయనకు ఆలయం నిర్మిం చాలన్నది ప్రతి ఒక హిందువుల ఆశయమంటూూయన వ్యాఖ్యానించారు.