ఏపిలో కొత్తగా 10,128 కేసుల నమోదు

1,86,461కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

corona virus -ap

అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. నిన్న కొత్తగా 10,128 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1544, కర్నూలు జిల్లాలో 1368, అనంతపురం జిల్లాలో 1260 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,86,461కి చేరుకుంది. గత 24 గంటల్లో 77 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో ఏకంగా 16 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 8,729 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,35,646 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/