నంబర్‌ వన్‌ జట్టుగా టీమిండియా

TEAM INDIA
TEAM INDIA

ఐసిసి వన్డే ర్యాంకుల విడుదల:

నంబర్‌ వన్‌ జట్టుగా టీమిండియా

దుబాయి: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ఆదివారం రాత్రి ముగియడంతో సోమవారం ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. ఈ సిరీస్‌కి ముందు మూడో స్థానంలో ఉన్న భారత్‌ జట్టు 4-1తేడాతో సిరీస్‌ని గెలవడంతో అధికారి కంగా అగ్రస్థానాన్ని 120 పాయింట్లతో సుస్థిరం చేసుకుంది. మరోవైపు ప్రత్యర్థి ఆస్ట్రేలియా రెండో స్థానం నుంచి 114 పాయింట్లతో మూడో స్థానా నికి దిగజారింది. గత కొంతకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా 119పాయింట్లతో రెం డో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పట్లో ఈ మూడు జట్లకి వన్డేసిరీస్‌లులేని నేపథ్యంలో భారత్‌ కొద్ది రోజులపాటు అగ్రస్థానంలో కొనసాగే అవకాశం ఉంది.టెస్టుల్లోనూ టీమిండియా ప్రస్తుతం నం.1గా ఉన్న విషయం తెలిసిందే. వన్డే బ్యాట్స్‌ మెన్‌ ర్యాకింగ్స్‌ జాబితాలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (877 పాయింట్లు), ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (865 పాయింట్లు) మధ్య అగ్ర స్థానం కోసం పోటీనెలకొనినా, చివరికి కోహ్లీనే నెం.1గా నిలిచాడు. చివరి వన్డేలో శతకం బాదిన రోహిత్‌ శర్మ నాలుగు స్థానాలు ఎగబాకి, ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ ఓపెనర్‌కి కెరీర్‌లో ఇదే బెస్ట్‌ ర్యాంక్‌. బౌలింగ్‌ జాబితాలో నెం.1 స్థానంలో దక్షిణాఫ్రికా బౌలర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (718) ఉండగా, ఐదోస్థానంలో భారత్‌ డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (671) నిలిచాడు.