కవితపై పోటీకి 1000 మంది

MP Kavitha
MP Kavitha

నిజామాబాద్‌: సిఎం కెసిఆర్‌ కూతురు, నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితపై పోటీకి 1000 మంది సిద్ధమవుతున్నారు. వారు ఎవరో వారు నిజామాబాద్‌కు చెందిన అన్నదాతలు. వీరంతా తమ నిరసనను తెలిపేందుక కొత్త మార్గన్ని ఎంచుకున్నారు. బ్యాలెట్‌ పోరుకు అన్నదాతలు సిద్ధమవుతన్నారు. పసుపు, ఎర్రజొన్న మద్దతుధర కోసం అన్నదాతలు ఈ నిర్ణయానికి వచ్చారు. అయితే నిజామాబాద్‌ లోక్‌సభ బరిలో సిట్టింగ్‌ ఎంపిగా కవిత బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమెపై పోటీకి 500 నుంచి 1000 నామినేషన్లు దాఖలు చేయాలని రైతు సంఘాలు తీర్మానించాయి.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/