తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం

చెన్నై: తమిళనాడులోని మధవరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉవ్వెత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ అగ్నిజ్వాల పక్కనే ఉన్న మరో గోడౌన్‌ను సైతం చుట్టుముట్టింది. ఆ పరిసరాల్లో ఆగి ఉన్న పది లారీలు దగ్ధమయ్యాయి. దట్టమైన పొగతో ఆ పరిసరాలు నిండడంతో శ్వాస సమస్యతో జనం తల్లడిల్లాల్సిన పరిస్థితి. ఈ మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది వీరోచితంగా శ్రమిస్తున్నారు. చెన్నై శివార్లలోని మాధవరం పరిసరాలు గోడౌన్లు, పలు చిన్న తరహా పరిశ్రమతో నిండి ఉంటాయి. ఇక్కడే ఇటీవల సబర్బన్ బస్ టెర్మినల్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ వైపుగా వెళ్లే అన్ని బస్సులు ఇక్కడి నుంచి బయలుదేరుతాయి. మాధవరం జంక్షన్‌లో సబర్బన్ బస్ టెర్మినల్ ఉండగా, దానికి వెనుక ఉన్న రసాయన పరిశ్రమలో హఠాత్తుగా శనివారం సాయంత్రం మూడున్నర గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడడంతో ఆ పరిసర ప్రాంత వాసులు ఆందోళన చెందారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/