1000మంది కళాకారులకు పెన్షన్లు

AP CM BABU
AP CM BABU

1000మంది కళాకారులకు పెన్షన్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో బేడ, బుడిగ, జంగాల సామాజిక వర్గాన్ని ఎస్సీలల్లో చేర్చేందుకు అధ్యయనానికి మాజీ ఐఎఎస్‌ అధికిరా జెసి శర్మ నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఒకప్పుడు ఈ సామా జిక వర్గానికి చెందిన కళాకారులు భాగవతం, మరికొన్ని కళారూపాలను ప్రదర్శించేవారని, జానపద కళారూపాలతో పల్లెల్లో సందడి చేశారని గుర్తు చేశారు. అటువంటి కళాకా రులను గుర్తించి వారికి కళాకారుల విభాగంలో పెన్షన్లు మంజూరు చేస్తామని, తొలుత 1000 మంది పేద కళాకారులను గుర్తించి పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు తెలిపారు.

సోమవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసం సమీ పంలోని మైదానంలో ఏర్పాటు చేసిన బేడ బుడిగ జంగాల హక్కుల పోరాట మహాసభలో సీఎం చంద్రబాబు ప్రసగించారు. ఎస్సీలకు కల్పిస్తున్న అన్ని రాయితీలను వీరికి కల్పిస్తా మని, చంద్రన్న భీమా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. బేడ బుడిగ జం గాల సామాజికి వర్గంలో పెళ్లి చేసుకునే వధువులకు ఎస్సీ వధువులకు ఇస్తున్నట్లు గానే రూ.40,000మేర పెళ్లికానుకను వర్తింపేస్తామని ముఖ్యమంత్రి ప్రకటిం చారు.

నెలకు రూ.10వేల ఆదాయం వచ్చేలా తీర్చిదిద్దుతామని నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని సీఎం తెలిపారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం జీవో 144ద్వారా బేడ బుడిగ జంగాలకు ఉన్న ఎస్సీ రిజర్వేషన్‌ తొలగిం చిందని, ఈ రిజర్వేషన్‌ను పునరుద్దరిం చడానికి శర్మ కమిటీ నివేదిక ఇచ్చిన తరు వాత అధ్యయనం చేసి తగిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని చంద్రబాబు వివరించారు. రాజకీయాల్లో కూడా ఈ సామాజికి వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. విదేశాల్లో చదివే విద్యార్ధులకు రూ.10లక్షల సహాయం అందజేస్తామన్నారు.