100 కోట్లతో బోర్డు తిప్పేసిన శివశక్తి చిట్‌ఫండ్‌!

Fraud
Fraud

హైదరాబాద్‌: నాలుగేండ్లలో పెట్టిన పెట్టుబడికి రెండింతలు చేసి ఇస్తామంటూ నమ్మించిన శివశక్తి చిట్‌ఫండ్‌ యాజమాన్యం రూ. 100 కోట్లు డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేశారు. పక్కా ప్లాన్‌తోనే డిపాజిట్లు సేకరించి వాటిని హవాలా, బంగారం, వెండి మార్కెట్లలో పెట్టుబడుల రూపంలో పక్కదారి పట్టించారంటూ బాధితులు వాపోతున్నారు. ఈ సంస్థ మోసంపై రోజుకొకరు ఎస్‌ఆర్‌నగర్‌, బేగంపేట్‌ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు సందీప్‌ కుమార్‌, విక్రమ్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. మిగతా వారు పరారీలో ఉండడంతో వారి కోసం గాలిస్తున్నారు. భారీ వడ్డీలు ఆఫర్లు ఇచ్చి వారి కుటుంబానికి బాగా తెలిసిన వారి నుంచే చిట్స్‌, డిపాజిట్ల రూపంలో తీసుకుని మొత్తం రూ. 100 కోట్ల వరకు వసూల చేసినట్లు సమాచారం.