ఆప్ఘన్‌లో రోడ్డు ప్రమాదం..పది మంది మృతి

road accident
road accident

కాబూల్‌: ఆప్ఘనిస్థాన్‌లో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హెరాత్‌ ప్రావిన్స్‌ దక్షిణ ప్రాంతంలో మినీబస్సు అదుపుతప్పి మరో బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలను కోల్పోగా మరో ఆరుగురు గాయపడ్డారు. దరాస్‌ఖాన్‌ జిల్లా తపఖాకీ ప్రాంతం సమీపంలో హెరాత్‌‌కాందహార్‌ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని ప్రావిన్షియల్‌ అధికార ప్రతినిధి జిలానీ ఫర్హాద్‌ తెలిపారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/