ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

ఛాట్‌ పూజలు ముగించి ఆటోలో తిరుగు పయనమైన భక్తులు

భువనేశ్వర్‌: అసోంలోని కరీంగంజ్ జిల్లా బైఠఖల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బైతఖల్‌ వద్ద ఆటోను ఓ సిమెంట్‌ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది మృతిచెందారు. ప్రమాద ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గురువారం ఉదయం 7.30 గంటలకు అసోం-త్రిపుర జాతీయ రహదారి 8పై బైతఖల్‌ వద్ద ఆటోను ట్రక్కు ఢీకొట్టిందని (accident) చెప్పారు. తొమ్మిది మంది ఘనటనా స్థలంలోనే మృతిచెందారని, మరొకరు దవాఖానలో మరణించారని వెల్లడించారు. ఛాట్‌ పూజ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుల్లో మహిళలు, యువతులు, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపాడని, అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. 10 మంది మృతికి కారణమైన లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/