2019 క్యాట్‌ ఫలితాలు విడుదల

CAT 2019
CAT 2019

ఢిల్లీ: 2019 లో నిర్వహించిన కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌) ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఈ సంవత్సరం అత్యధికంగా 10 మంది అభ్యర్థులు 100 శాతం స్కోరును సాధించారు. టెక్నాటజీ, ఇంజినీరింగ్‌ నుంచి వచ్చిన 10 మంది అబ్బాయిలు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఐఐఎం కోలికోడ్‌ ప్రకటించింది. వీరిలో ప్రధానంగా మహారాష్ట్రకు చెందిన నలుగురు, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మరో 21 మంది 99.99 శాతం స్కోరును సాధించారు. 1,34,917 మంది అబ్బాయిలు, 75,004 మంది అమ్మాయిలు ఈ ఏడాది క్యాట్‌ పరీక్షకు హాజరయ్యారు. గత పదేళ్లలో ఇంత ఎక్కువ మంది క్యాట్‌ పరీక్ష రాయడం ఇదే ప్రథమం.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/