10% లాభపడిన అరబిందోఫార్మా

mediciens

10% లాభపడిన అరబిందోఫార్మా

ముంబయి, మే 31: అరబిందోఫార్మా 10శాతం లాభపడి సానుకూల వృద్ధిదిశగా షేర్లు ర్యాలీతీస్తు న్నాయి. కంపెనీ స్టాక్‌ మంగళవారం నాటిట్రేడింగ్‌ లో సుమారు 568.25 రూపాయల నుంచి 506 రూపాయల మధ్యలో ట్రేడింగ్‌ నిర్వహించారు. ఫార్మారంగం భారీపతనం చవిచూస్తున్నా ఆరబిందో ఫార్మా మాత్రం 10.6శాతం పెరిగింది. కంపెనీ 2018 ఆర్థికసంవత్సరం వృద్ధి మరింతగా ఉంటుం దని అంచనావేసింది. నాలుగోత్రైమాసిక ఫలితాలు క్షీణించినా తక్కువగానే ఉన్నాయి. కంపెనీ నాలుగు శాతం నికరలాభాల్లో క్షీణత నమోదుచేసి 532.22 కోట్లుగా అంచనావేసింది. నాలుగోత్రైమాసికంలో కంపెనీ 554.51 కోట్లుగా ప్రకటించింది. హెల్త్‌కేర్‌ కంపెనీ అమెరికా ధరలపోటీ ఒత్తిడిని తక్కువగానే అంచనావేస్తున్నట్లు వెల్లడించింది.

అమెరికాలోధరల కుదింపు కారణంగా 7-8శాతంగా ఉంటుందని అంచనావేసింది. కంపెనీ పోటీసంస్థలకంటే తక్కువ గానే ఉందని రానున్న కాలంలో రెండంకెల ప్రగతిని సాధించగలమని అంచనావేసింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు 29వ తేదీ సమావేశం అయి రెండోవిడత తాత్కాలిక డివిడెండ్‌ 1.25 రూపాయలు చొప్పున ప్రకటించే వీలుందని బిఎస్‌ఇకి తెలియజేసింది. రూపాయల విలువైన షేరుకు 1.25డివిడెండ్‌గా వెల్లడించింది. మొత్తం డివిడెండ్‌ రెండోవిడత 250 శాతంగా ఉంటుంది.

ఇప్పటివరకూ 2.50 రూపా యలు చొప్పున ఒక్కొక్క ఈక్విటీ వాటాకు చెల్లించిం దని అంచనా. మొత్తం 4.38 లక్షల షేర్లు చేతులు మారాయి. గడచిన ఒక త్రైమాసికంలో 2.57 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ స్టాక్‌ గరిష్టంగా 506 నుంచి 547.45రూపాయలకు చేరింది. కంపెనీ షేర్లు ఉదయం 11.24 గంటలకు 8.33 శాతం పెరిగి 556.5 రూపాయలుగా నడిచింది. సెన్సెక్స్‌లో 506నుంచి 568.25రూపాయలమధ్య నడిచింది. గత ఏడాది అక్టోబరు ఆరవ తేదీకూడా కంపెనీ స్టాక్‌ 895కి పెరిగింది. కంపెనీ 15.24 శాతం షేర్లు గడచిన నెలరోజులుగా తగ్గాయి. మే 29వ తేదీవరకూ అదేతీరు చూపించింది. అంతకు ముందు సెన్సెక్స్‌లో 3.98శాతం పెరిగింది. కంపె నీ స్టాక్‌ గడచిన త్రైమాసికకాలంగా ఒత్తిడితోనే కొన సాగుతున్నాయి. 24.14శాతం క్షీణించింది. అదే సమయంలో సెన్సెక్స్‌ 8.23శాతం లాభాల్లో నడి చింది. బిఎస్‌ఇ హెల్త్‌కేర్‌సూచి 10శాతంవరకూ దిగ జారింది. అమెరికా ఎఫ్‌డిఎ తరచూ భారత్‌ ఔషధ కంపెనీలను తనిఖీలుచేయడం వంటివి ఇందుకుకీల కమని, వీటికితోడు అమెరికాలో ధరలపోటీ కూడా అధికం కావడం, కరెన్సీ హెచ్చుతగ్గులు కూడా ఒక విధంగా కారణం అవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫార్మారంగంలోని టాప్‌ ఐదు కంపెనీ లు 22-25శాతం ట్రేడింగ్‌ జరిపినవి ప్రస్తుతం 17-18 రెట్లు మాత్రమే జరుపుతున్నట్లు ఫార్మానిపు ణులఅంచనా. మొత్తం మీద ఫార్మారంగం దిగజారి నా అరంబిందోషేర్లు మాత్రం ర్యాలీతో ఉన్నాయి.