10శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

SUPREME COURT
SUPREME COURT
న్యూఢిల్లీ : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ లోక్‌సభ, రాజ్యసభ బిల్లును ఆమోదించిన మర్నాడే సుప్రీంకోర్టును కొందరు ఆశ్రయించారు. రాజ్యాంగాన్ని సవరిస్తూ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమని పిటిషనర్లు ఆరోపించారు. సుప్రీంకోర్టు రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేసిందని గుర్తు చేశారు. రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆర్థిక వెనుకబటుతనాన్ని పరిగణనలోకి తీసుకోరాదని పేర్కొన్నారు. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే పేరుతో కొందరు ఉద్యమకారులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.