10వ తరగతి టాపర్లకు ముత్తూట్‌ ఆర్థికసాయం

MUTHOOT
హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ముత్తూట్‌ ఎంజార్జ్‌ ఎక్సెలెన్స్‌ అవార్డులు ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని పదోతరగతి టాపర్లకు ఈ ఉపకార వేతనం అందిస్తున్నామని, తాజాగా తెలంగాణలో 200 ప్రభుత్వ పాఠశాలలను కవర్‌ చేసామని ముత్తూట్‌ డైరెక్టర్‌ అపాన్‌ అలెగ్జాండర్‌ ముత్తూట్‌ వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సోమిరెడ్డి, డిజిఎం కార్పొరేట్‌ కమ్యూని కేషన్స్‌ బాబుజాన్‌ మలైయిల్‌, సికింద్రా బాద్‌రీజి యన్‌ రీజినల్‌ మేనేజర్‌ లెఫ్టి నెంట్‌ కల్నల్‌ చంద్ర శేఖరన్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్ధులను ప్రోత్సహించే లక్ష్యంతో అలెగ్జాండర్‌ ముత్తూట్‌ ఎంజార్జి ఎక్సెలెన్సీ ఉపకారవేతనాలు ప్రతిఏటా అందిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు భవి ష్యత్తులో పలు సామాజిక కార్యక్రమాలతో సామా జిక సేవా పథకాలకు కట్టుబడి ఉన్నామన్నారు. 2010లో ప్రారంభించిన ఈ పథకం కేరళ నుంచి 2013లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు విస్తరించినట్లు ఎపాన్‌ అలెగ్జాండర్‌ పేర్కొన్నారు. ఆయా ప్రభుత్వ పాఠశాలలు ఎంపికచేసిన ర్యాంకుల జాబితా ఆధారంగా జిల్లా విద్యాశాఖాధికారులను సంప్రదించి అనంతరం ఎంపిక చేస్తామన్నారు. సంస్థ కార్పొరేట్‌ సామా జిక బాధ్యతల నిర్వహణలోభాగంగా విద్యారంగా నికి విశేష సహకారం అందిస్తోంది. ఆర్థిక స్తోమతలేక చదువు నిలిపివేసిన కుటుంబాల్లోని పిల్లల విద్యాభివృద్ధికి ఈ ఉపకార వేతనాలు ఎంతో ప్రయోజనకరమని ఆయన తెలిపారు.