10రోజుల్లోగా నివేదిక ఇవ్వండి: సివిసి 

CBI enquiry
CBI enquiry

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంపై విచారణప్రారంభించిన కేంద్ర విజిలెన్స్‌కమిషన్‌ తాజాగా పదిరోజులలోపు సమగ్రనివేదికివ్వాలని బ్యాంకును ఆదేశించింది. ఇప్పటికే ఇడి, సిబిఐ తమ తనిఖీలను ముమ్మరంచేస్తూ మరిన్నిచోట్ల కొనసాగిస్తున్నాయి. వ్యవస్థీకృత లోపాలు మొత్తంగా వివరిస్తూ ఈ భారీ కుంభకోణానికి కల కారణాలను నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.ముంబైలోని బ్రాడీహౌస్‌శాఖలో ఈ భారీ కుంభకోణం వెలుగుచూసిన సంగతితెలిసిందే. అలాగే బ్యాంకు అధికారుల పేర్లు కూడా ప్రస్తావించాలని సూచించింది. సీనియర్‌మేనేజ్‌మెంట్‌ అధికారులు వారిపై యాజమాన్యం తీసుకున్న చర్యలు పునరావృతం కాకుండా చేపట్టేప్రణాళిక మొత్తం వెల్లడించాలనికోరింది. ఏడేళ్లపాటు సాగిన ఈ కుంభకోణం ఇప్పటివరకూ ఎందుకు వెలుగులోనికి రాలేదని, బ్యాంకు పర్యవేక్షణ లోపాలు ఎక్కుడ ఉన్నట్లని సివిసి కమిషనర్‌కెవిచౌదరి ప్రశ్నించారు. చౌదరి సివిసి కేంద్ర కార్యాలయంలో రెండున్నర గంటలపాటు సమావేశం నిర్వహించారు. బ్యాంకు ఎండి సిఇఒ సునీల్‌మెహతాతోపాటు ఛీఫ్‌ విజిలెన్స్‌ అధికారి సైతం ఈసమావేశంలో పాల్గొన్నారు. విజిలెన్స్‌ కమిషనర్‌ టిఎం భాసిన్‌, సివిసిలు ఈ సమావేశంలో బ్యాంకు కార్యకలాపాలపై విస్తృత పరిశీలనచేసారు. ఆర్ధికశాఖ అధికారులు, రిజర్వుబ్యాంకు ప్రతినిధి సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తమతమతనిఖీలను మరింత ముమ్మరంచేసారు. ఐటిశాఖ కూడా నీరవ్‌మోడి, మెహుల్‌చోక్సీలకు చెందిన కంపెనీలపై దాడులు నిర్వహించారు. పిఎన్‌బి బ్రాడీహౌస్‌బ్రాంచ్‌లో కూడా విస్తృతంగా సోదాలుచేసారు. ఛత్రపతిశివాజీ శతజయంతిసందర్భంగా శెలవు అయినా సరే వరుసగా సోదాలు నిర్వహించారు. విపుల్‌ అంబాని సిఎప్‌ఒ నీరవ్‌ మోడీ కంపెనీప్రతినిధిగా విచారణజరిపారు. ధీరూభా§్‌ు అంబానికి బంధువుగా విపుల్‌ అంబానిని చెపుతున్నారు. ఫైర్‌స్టార్‌ డైమండ్స్‌లో ఆయన సిఎప్‌ఒగా పనిచేస్తున్నారు. నీరవ్‌మోడీ సంస్థల కార్యకలాపాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నీరవ్‌మోడీ దక్షిణముంబై నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు యాజమాన్యం తమ ఎల్‌ఒయుల ద్వారా ఇతర బ్యాంకులు చేసిన అన్ని చెల్లింపులకు తమదే బాధ్యత అని స్పష్టంచేసింది. ఆర్‌బిఐ మార్గదర్శకాలను అనుసరించి తమ బ్యాంకు నడుచుకుంటుందని అన్నారు. భారతీయ బ్యాంకులు విదేశీ శాఖలు ఎల్‌ఒయులను అనుమతించాయని, ఆర్‌బిఐ నిర్ణయించినమేరకు తాము బాధ్యతాయుతంగా నడుచుకుంటామని బ్యాంకు ఎండి సిఇఒ వెల్లడించారు.