10జిబి ర్యామ్‌తో వివో స్మార్ట్‌ఫోన్‌

VIVO1
VIVO

10జిబి ర్యామ్‌తో వివో స్మార్ట్‌ఫోన్‌

హైదరాబాద్‌, జనవరి 31: ఆకట్టుకునే ఫీచర్లతో ఎప్పడికప్పుడూ కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుద లచేసే చైనీస్‌ మొబైల్స్‌ తయారీదారి వివో, మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే తీసుకురాబోతుంది. 10జిబి ర్యామ్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌ల్కోకి విడుదల చేయబోతుందని లీకేజీలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ ఈ లీక్‌లు కనుక నిజమైతే, ఎప్పటి వరకు వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో ఇదే ప్రత్యేక ఆక ర్షణ. వివో ఎక్స్‌ప్లే 7 పేరుతో దీన్ని లాంచ్‌ చేస్తుందని, ఇది 4కే ఒలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌రడాగన్‌ 845ఎస్‌ ఒసి, 512జిబి స్టోరేజ్‌, అండర్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ వంటి అద్భుత ఫీచర్లతో రూపొం దిందని తెలుస్తోంది. 4 ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌తో డ్యూయల్‌ రియర్‌ కెమెరాను ఇది కలిగి ఉందని లీకేజీలు చెబు తున్నాయి.

10 జిబి ర్యామ్‌ కలిగిన ఈ ఫోన్‌ 256జిబి, 512జిబి రెండు స్టోరేజ్‌ వేరి యంట్లలో రాబోతుందని తెలుస్తోంది. అయితే ధర, అందు బాటులో ఉండే వివరాలపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కానీ వచ్చే కొన్నివారాల్లో, ప్రారంభ ధర 500 డాలర్లకు అంటే రూ.31,800కు దీన్ని లాంచ్‌ చేస్తారనిటాక్‌. 2016లో లాంచ్‌ చేసిన వివో ఎక్స్‌్‌ప్లే 6కు సక్సె సర్‌గా దీన్ని తీసుకురాబోతుం ది. స్పెషిఫికేషన్ల విషయం లోనూ 2018 బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్ల లో ఇదీ ఒకటిగా నిలువనుంది. 10జిబి ర్యామ్‌ కలిగి, అండర్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రిం ట్‌ సెన్సార్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ కూడా ఇదే కావడం విశేషం. అండర్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో వివో ఇటీవలే ఎక్‌్‌స 20ప్లస్‌ యూడీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే.