అమెరికాలో కాల్పులు..చిన్నారి సహా ఇద్దరు మృతి

అమెరికా : అమెరికా లాస్‌ ఏంజిల్స్‌లో దారుణం జరిగింది. మారణాయుధాలతో ఓ షోరూమ్‌లోకి చొరబడిన దుండగుడు వీరంగం సృష్టించాడు. ఓ మహిళపై దాడి చేశాడు. సమాచారమందుకున్న పోలీసులు..అక్కడికి చేరుకొని ఆ దుండగుడిని పట్టుకునేందుకు కాల్పులు జరిపారు. అయితే ఆ కాల్పుల్లో 14ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఆ తర్వాత ఆ దుండగుడిని కూడా మట్టుబెట్టారు పోలీసులు. దుండగుడి దాడిలో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శాన్ ఫెర్నాండో వ్యాలీలోని నార్త్ హాలీవుడ్ బర్లింగ్‌టన్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. తాజాగా ఆ దేశంలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. అంతకుముందు కూడా జరిగిన కాల్పుల ఘటనల్లో అనేక మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం పోలీసులు.. అప్రమత్తమయ్యారు. షోరూమ్ ప్రదేశాన్ని చుట్టుముట్టి వివరాలు సేకరిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/