పదేళ్లలో 1.4 మిలియన్ల ఐటి కొలువులు

it jobs
it jobs

బెంగళూరు: భారత్‌లోని ఐటిరంగంలో 2027 నాటికి 1.4 మిలియన్‌ కొలువులు లభిస్తాయన్న అంచనాలు జోరుగా ఉన్నాయి. మొత్తంగాచూస్తే 47శాతం పెరుగుతాయని సిస్కో ఐడిసి సంయుక్త సర్వేలో తేలింది. ఉపాధిసృష్టిసైతం వర్ధమాన టెక్నాలజీల్లో ఎక్కువ ఉంటుంది. సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, బిగ్‌డేటా వంటి ప్రాంతాల్లో ఉంటాయని అంచనావేసారు. ఐడిసి ఇన్ఫోబ్రీఫ్‌ భారత్‌లో 20 ప్రభావిత ఐటి విభాగాలు సోషల్‌ మీడియా అడ్మినిస్ట్రేట్‌, మెషిన్‌ లెర్నింగ్‌ డిజైనర్‌, ఐఒటి డిజైనర్‌ వంటివి ఉన్నాయి. మొత్తం 2017 నాటికి దేశంలో 9.1 మిలియన్‌ ఐటి కొలువులున్నాయి. యాజమాన్యాలపరంగా 5.9 మిలియన్‌ కొలువల పోస్టింగ్‌ జరిగినట్లు అంచనా. ప్రపంచ వ్యాపతంగా యుక్తవయసు వారికి కొలువులు మరోఐదు మిలియన్‌లవరకూ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 2027 నాటికి కొత్తవారికి 36శాతంపెరుగుతాయని అంచనా. ఇపుడు కొత్తగా తీసుకుంటున్న మేనేజర్లలో 86శాతం మందిని అభ్యర్ధి పనితీరు ప్రతిభ ఆధారంగా మాత్రమే చేస్తున్నారు.సేవలు, సపోర్టుపరంగా మరిన్ని కొలువులు ఉంటాయని అంచనా. ఐడిసి అంచనాలప్రకారంచూస్తే మొత్తంగా 1.4 మిలియన్‌ కొలువులు పెరుగుతాయని పేర్కొంటున్నారు.