1.25 లక్షల శాఖలకు పోస్టల్‌బ్యాంకు విస్తరణ

manoj sinha
manoj sinha

కేంద్రమంత్రిమనోజ్‌సిన్హా
న్యూఢిల్లీ: ఇండియాపోస్టపేమెంట్స్‌బ్యాంకు దేశవ్యాప్తంగా 1.25 లక్షల శాఖలకు విస్తరించనున్నట్లు తంతితపాలాశాఖమంత్రి మనోజ్‌సిన్హా వెల్లడించారు. కార్యకలాపాలు ఇప్పటికే 1.5 లక్షల కేంద్రాలకు విస్తరించాలన్న లక్ష్యం విధించినట్లు వివరించారు. పోస్టల్‌శాఖ ఆధ్వర్యంలోనే ఇండియాపోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకును ప్రారంబించి ఇప్పటివరకూ బ్యాంకింగ్‌స ఏవలు లేని ప్రాంతాలకు విస్తరించాలనినిర్ణయించారు. సుమారు 1.25 లక్షలపోస్టల్‌ శాఖలున్న కార్యాలయాల్లో ఈ బ్యాంకు ప్రారంభం అవుతుంది. దేశంలో 1.5 లక్షల శాఖలకు విస్తరిస్తామని వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరు 1వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ బ్యాంకునుప్రారంబించారు. మూడులక్షల పోస్టుమ్యాన్‌లు గ్రామీణ్‌ డాక్‌సేవక్స్‌ డిజిటల్‌ యంత్రసామగ్రితో ఆర్ధికసేవలు అందిస్తారని వెల్లడించారు. పేమెంట్‌ బ్యాంకు లక్ష రూపాయలవరకూ డిపాజిట్లు స్వీకరిస్తుంది. చెల్లింపులు, బదిలీలు, కొనుగోళ్లు ఇతర బ్యాంకింగ్‌సేవలు ఎటిఎం డెబిట్‌కార్డులు, నెట్‌బ్యాంకింగ్‌, థర్డ్‌పార్టీ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటివి అమలుచేస్తుంది. అయితేనేరుగా రుణాలు జారీచేయడంకానీ, క్రెడిట్‌కార్డులు జారీచేయడం కానీ ఉండదు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఇప్పటివరకూ 1.3 లక్షలవరకూ పోస్టల్‌శాఖ కార్యాలయాలున్నాయి. మరిన్ని శాఖలు ప్రారంభించి మొత్తం 1.5 లక్షలకు చేరుస్తామని సిన్హా వెల్లడించారు.