సీఎం కేసీఆర్‌ కు భయపడే.. ఇలా ఐటీ రైడ్స్‌ చేయిస్తున్నారంటూ బిజెపి ఫై మల్లారెడ్డి ఫైర్

గత రెండు రోజులుగా మంత్రి మల్లారెడ్డి కి సంబదించిన ఆస్తులపై ఐటి అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మల్లారెడ్డి తో పాటు ఆయన కుమారులు, అల్లుళ్లు , బంధువులు ఇలా ఎవర్ని వదిలిపెట్టకుండా సోదాలు చేస్తూ..పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి మీడియా సమావేశం ఏర్పటు చేసి బిజెపి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

సీఎం కేసీఆర్‌ కు భయపడే, ఇలా ఐటీ రైడ్స్‌ చేయిస్తున్నారని బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. నాకు కేసీఆర్ అండగా ఉన్నారు..ఎవరూ ఏం పీకలేరని కీలక వ్యాఖ్యలు చేసారు. ఐటీ రైడ్స్‌ విషయం సీఎం కేసీఆర్‌ ముందే చెప్పారు.. బీజేపీ కుట్రలకు భయపడేదిలేదని పేర్కొన్నారు. BRS పార్టీ కేసీఆర్‌ పెట్టారనే భయంతో.. కేంద్రం ఇలా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. కేంద్ర బలగాలతో పెద్ద ఎత్తున మాపై దాడులు చేశారని, మెడికల్‌ సీట్లల్లో అక్రమాలు జరిగాయని అంటున్నారని.. మేం దీంట్లో ఎలాంటి డొనేషన్లు తీసుకోలేదని పేర్కొన్నారు. ఐటీ అధికారులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని.. కేంద్రం వీళ్లను నడిపిస్తుందని నిప్పులు చెరిగారు మల్లారెడ్డి. నా కొడుకు, కోడలు ఆస్పత్రి ఉన్నారు.. మేం పోతామంటే వెళ్లనివ్వలేదని ఫైర్‌ అయ్యారు.