సింగపూర్‌ను తలదన్నేలా నెల్లూరు అభివృద్ధి

 

BABU2
నెల్లూరు: సింగపూర్‌ను తలదన్నేలా నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఎపి ముఖ్యమంత్రి నాయుడు అన్నారు. ఆదివారం నెల్లూరు పర్యటనలో భాగంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సంగపూర్‌లో ఒకపోర్టు ఉంటే నెల్లూరుకు రెండు పోర్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. నెల్లూరు జిల్లాలో టూరిజం అభివృద్ధికి కేంద్రనుంచి రూ.60 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. కేంద్ర నుంచి వెంకయ్యనాయుడు సహకారంతో ఎన్నోప్రాజెక్టులు వస్తున్నాయని, భవిష్యత్తులో కృష్ణా పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు. సంగం, నెల్లూరు బ్యారేజ్‌పనులు వచ్చే వర్షాకాలం నాటిని పూర్తిచేస్తామన్నారు. కేంద్రం ప్రభుత్వం ఎపికి త్వరలో ప్రత్యేక రైల్వేజోన్‌ ప్రకటిస్తుందని చెప్పారు.