శ్రీశైలంకు బయల్దేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హైదరాబాద్ కు విచ్చేసిన ద్రౌపది ముర్ము

president-of-india-droupadi-murmu-reaches-hyderabad

హైదరాబాద్ః భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు విచ్చేశారు. ఆమెకు గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం తరపున సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రపతికి స్వాగతం పలకకపోవడం చర్చకు దారితీసింది. హైదారాబాద్ నుంచి రాష్ట్రపతి హెలికాప్టర్ లో శ్రీశైలంకు బయల్దేరారు. ఆమెతో పాటు గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వెళ్లారు.

మరోపక్క, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శ్రీశైలంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఆలయ పరిధిలోని ప్రధాన కూడళ్లలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాన్ని నిలిపివేశారు. స్వామివారిని రాష్ట్రపతి దర్శించుకున్న అనంతరం భక్తులకు దర్శనాలు పునఃప్రారంభమవుతాయి.

కాగా, శ్రీశైలంలో రాష్ట్రపతి ప్రసాద్‌ పథకం ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తర్వాత శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు శ్రీశైలం నుంచి హైదరాబాద్‌లోని హకీంపేటకు చేరుకుంటారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కెసిఆర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు సాదర స్వాగతం పలుకనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/