శీతాకాలంలో పసుపు పాలు


శీతాకాలంలో వచ్చే జబ్బులను పసుపు పాలు కట్టడి చేస్తాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్నిస్తాయి. నెలసరి సమయంలో గ్లాసు పాలను తీసుకుంటే కడుపులో కలిగే నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం కలుగుతుంది. పసుపు పాలు సౌందర్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయి. చక్కర కలపని ఒక గ్లాసు పాలలో చిన్న చెంచా పసుపు, చిన్న అల్లం ముక్క, చెంచా తేనె, చిటికెడు మిరియాల పొడి వేసుకుని పాలు మరిగిస్తే బంగారు వర్ణంలో సిద్ధం. చలికాలంలో వేధించే దగ్గు, జలుబు వంటివి తగ్గుముఖం పడతాయి. ఉదయాన్నే వేడి వేడి పసుపు పాలని తీసుకుంటే శ్వాసకోశ వ్యాధుల నుంచి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/