శీతలపానీయాలు హానికరం..

ఆరోగ్యం-జాగ్రత్తలు

Soft drinks are harmful
Soft drinks are harmful

వేసవి కాలం వచ్చేస్తుంది ఈ కాలంలో కూల్‌డ్రింక్స్‌ తాగనివారు అరుదుగా ఉంటారు. సరదాగా బయటకు వెళ్లినా ఇంట్లోకి బంధువులు వచ్చినా.. చాలామంది కూల్‌ డ్రింగ్స్‌ తప్పనిసరిగా తాగు తుంటారు. తియ్యతియ్యగా.. చల్లచల్లగా.. ఉండే ఈ శీతల పానీయాలు ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి వల్ల కలిగే అనర్ధాలేంటో తెలుసా?

  • కూల్‌డ్రింక్స్‌లో స్వీట్‌ సోడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రుచి కోసమే ఎక్కువ మంది శీతల పానీయాలు తాగుతుంటారు. వీటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా.. ఆరోగ్యానికి హాని చేస్తాయి.
  • మీరు తాగే కూల్‌డ్రింక్స్‌లో అత్యధిక స్థాయిలోచక్కెర ఉంటుంది. ఇది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
  • ఓ అధ్యయనం ప్రకారం కూల్‌డ్రింక్స్‌ తాగిన వారిలోఒబెసిటీ (ఊబకాయం) సమస్యలు పెరుగుతాయి.
  • కూల్‌డ్రింక్స్‌ ఎప్పుడో ఒకసారి తాగితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ తరచూ తాగితే గుండె సంబంధ వ్యాధులు కూడా వస్తాయి.
  • శీతల పానీయాలతో ఎసిడిటీతో పాటు జీర్ణ సంబంధ సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది.
  • గ్యాస్ట్రిక్‌ సమస్యలతో ఇబ్బంది పడతారు.- కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువ తాగే వారిపై సర్వే చేయగా.. వారిలో ఎక్కువ మంది అనారోగ్య సమస్యలకు గురయినట్లు అధ్యయనంలో తేలింది. అందుకే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండడం మంచింది.