వైట్‌హౌజ్‌ ప్రతినిథిపై సస్పెన్షన్‌ వేటు

వాషింగ్టన్‌: వైట్‌హౌస్‌ ప్రతినిధి టీజే డక్లోపై అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. మహిళా రిపోర్టుర్‌ను బెదిరించిన నేపథ్యంలో ఆయన పై వేటు వేశారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్న వేయడంతో పాలిటీకో రిపోర్టర్‌ తారా పల్యేరిని అంతు చూస్తానని డక్లో బెదిరించారు. మరో జర్నలిస్ట్‌తో డక్లో సంబంధంపై ఆరా తీస్తున్న పల్మేరిపై డక్లో విరుచుకుపడ్డారని బీబీసీ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ క్యాంపెయిన్‌ను కవర్‌ చేసిన జర్నలిస్ట్‌ అలెక్సి మెకమండ్‌తో డక్లో రాసలీలపై పల్మేరి విచారణ చేపట్టారు.

మహిళా విలేకరిని బెదిరించిన డక్లోను వారం రోజుల పాటు సస్సెండ్‌ చేశారు. సస్పెన్షన్‌ సమయంలో ఆయనకు ఎలాంటి చెల్లింపులు జరపరు. మరోవైపు పల్మేరికి డక్లో క్షమాపణలు తెలిపారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ పెకాయ్‌ వెల్లడించారు. మహిళా రిపోర్టర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన డక్లోపై కఠిన చర్యలు తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విఫలమయ్యారని పరిశీలకులు విమర్శిస్తున్నారు.