వెస్టిండీస్‌ 223/5

రాణించిన బోనర్‌

West Indies 1st innings
West Indies 1st innings

ఢాకా : నేషనల్‌ స్టేడియంలో గురువారం ఆరంభమైన రెండో టెస్టు తొలి రోజున వెస్టిండీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఎన్‌క్రమ బోనర్‌ అజేయ అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. తతిమా వారిలో కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌(47), ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌(36), జెర్మైన్‌ బ్లాక్‌వ్ఞడ్‌(28), జోషువా డిసిల్వ(22బ్యాటింగ్‌) పర్వాలేదనిపించారు. అబుజాయేద్‌, తైజుల్‌ ఇస్లాం చెరి రెండు వికెట్లు దక్కించుకున్నారు. తొలి రోజు ఇరు జట్లు సమఉజ్జీగా నిలిచాయి.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌కు ఓపెనర్లు బ్రాత్‌వైట్‌, క్యాంప్‌బెల్‌ అర్ధసెంచరీ భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. తొలి టెస్టులోవలె కాకుండా ఇరువ్ఞరూ సంయమనంతో ఆడుతూ పరుగులు జోడించారు. 66 పరుగులు జోడించిన తరువాత తైజుల ఇస్లాం వీరిని విడగొట్టాడు. క్యాంప్‌బెల్‌ 36 పరుగులు చేసి ఎల్బీగా వెనుతిరిగాడు.

తరువాత వచ్చిన మోస్లే నిరాశపరుస్తూ 7 పరుగులకే నిష్క్రమించాడు. అర్దసెంచరీ దిశగా పయనిస్తున్న బ్రాత్‌వైట్‌ను సౌమ్యసర్కార్‌ అవ్ఞట్‌చేశాడు. బ్రాత్‌వైట్‌ 122 బంతులెదుర్కొని నాలుగు బౌండరీలతో 47 పరుగులు చేశాడు. ఆపై తొలి టెస్టు హీరో కీల్‌ మేయర్స్‌ ఈసారి నిరాశపరుస్తూ అయిదు రుగులకే పెవిలియన్‌ చేరాడు. ఈ తరుణంలో బోనర్‌ బ్లాక్‌వ్ఞడ్‌తో కలిసి అర్దసెంచరీ భాగస్వామ్యం అందించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు.

ఈ నేపథ్యంలో బోనర్‌ అర్ధసెంచరీ పూరించాడు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న వీరిని తైజుల ఇస్లాం విడదీశాడు. బ్లాక్‌వ్ఞడ్‌ 28 పరుగులు చేసి తైజుల్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. ఆపై బోనర్‌, వికెట్‌కీపర్‌ జోషువా మరో వికెట్‌ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు. బోనర్‌ 173 బంతుల్లో ఆరు బౌండరీలతో 74, జోషువా 46 బంతుల్లో ఒక బౌండరీతో 22 పరుగులతో అజేయంగా నిలిచారు. టాస్‌ ఓడినా బంగ్లాదేశ్‌ ఎక్కువగా పరుగులు ఇవ్వకుండా పర్యాటక జట్టును కట్టడి చేసింది.

స్కోర్‌బోర్డ్‌ : వెస్టిండీస్‌ మొదటి ఇన్నింగ్స్‌

క్రెగ్‌ బ్రాత్‌వైట్‌ సి శాంటొ బి సౌమ్య సర్కార్‌ 47, జాన్‌ క్యాంప్‌బెల్‌ ఎల్బీ బి తైజుల్‌ ఇస్లాం 36, షేన్‌ మోష్లే బి అబు జాయేద్‌ 7, ఎన్‌క్రుమ బోనర్‌ 74 బ్యాటింగ్‌, కీల్‌ మేయర్స్‌ సి సౌమ్య సర్కార్‌ బి అబు జాయేద్‌ 5, జెర్మైన్‌ బ్లాక్‌వ్ఞడ్‌ సి అండ్‌ బి తైజుల్‌ ఇస్లాం 28, జోషువా డసిల్వ , ఎక్స్‌ట్రాలు , మొత్తం( ఓవర్లలో వికెట్లకు)
వికెట్ల పతనం : 1-66, 2-87, 3-104, 4-116, 5-178, 6-
బౌలింగ్‌ : అబు జాయేద్‌ ; మెహిది హసన్‌ ; నయీమ్‌ హసన్‌ ; తైజుల్‌ ఇస్లాం ; సౌమ్య సర్కార్‌