వలస కార్మికుల తరలింపుపై స్పష్టత నిచ్చిన పోలీసులు

రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిన తర్వాత వారికి ఓటిపి నంబర్‌ పంపనున్నట్లు తెలపిన పోలీసులు

migrant workers registration
migrant workers registration

హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన వలసకూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వలస కూలీలు పోలీస్‌ స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌ల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో పోలీసులు వారికి పలు సూచనలు చేస్తున్నారు. వలస కార్మికులు ఏ స్టేషన్‌కు, ఏ సమయంలో వెళ్లాలనే దానిపై వివరణ ఇస్తున్నారు. వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిన తరువాత వారి మొబైల్‌ నంబర్‌ కి ఓటిపి నంబర్‌ పంపిస్తామని, అందులో ఏ స్టేషన్‌కు, రైలు ఏ సమయంలో వస్తుందో పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు. అంతవరకు రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిన వారు ఎవరి బసకు వారు చేరుకోవాలని సూచించారు. రైళ్ల లభ్యతను బట్టి ఓటిపి పంపించడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/