రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది..మంత్రి అల్లోల

నిర్మల్‌: మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి జిల్లాలోని మామ‌డ మండలం పొన్కల్‌లో రైతువేదిక భ‌వ‌నాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, అందుకే సిఎం కెసిఆర్‌ వ్యవసాయరంగానికి మొదటి ప్రాధాన్యతనిచ్చి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. రైతుల సంక్షేమం కో సం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని, వాటిని అమలు చేస్తూ రైతును రాజులా చూస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి వసతి, 24 గంటల విద్యుత్‌, రైతుబంధు, రైతు బీమాను ప్రవేశపెట్టి రైతులను కంటికి రెప్పలా చూసుకుంటున్నదని చెప్పారు. రాష్ట్రంలో కరెంటుకు, నీళ్లకు కొదువ లేదని.. ఒకే వేదికలో రైతులందరూ కలిసి ఏయే పంటలు పండించుకోవాలో నిర్ణయించుకుని వాటిని సాగుచేయాలని సూచించారు. గ్రామంలో వ్యవసాయశాఖ అధికారి సలహాలు, సూచనలతో పంటలు వేయాల‌ని కోరారు.