రైతులకు మరింత చేయూతనివ్వాలి

కరోనా లాక్‌డౌన్‌తో వ్యవసాయం ప్రశ్నార్ధకం

Indian farmers
Indian farmers

కాలే కడుపునకు కూడే పరిష్కారం కానీ కరెన్సీ కాదన్న సత్యం కరోనా నిరూపించింది. ఈ నిజాన్ని గ్రహించి ఇకనైనా ప్రభుత్వాలన్నీ ఆకలిని తీర్చే అన్నదాతపై దృష్టి కేంద్రీకరించాలి.

మానవాళి మనుగడకు అత్యంత అవశ్యకం గాలి, నీరు, తిండి, ప్రాణం నిలబడాలంటే విలాసాలు కాదు. కడుపు నిండడమేనన్న ప్రాథమిక సూత్రం కరోనా మనకందించింది.

కడుపు కాలిన వాడికి కరెన్సీ కట్టలందిస్తే ప్రాణం నిలబడదు. ప్రపంచం నేడు ఎంతగానో అభివృద్ధి చెందింది.

శాస్త్రసాంకేతిక రంగాల్లో మానవు డు సాధించిన ప్రగతిని చూసి ఇప్పటి వరకు మనమంతా విర్రవీగాం. మృత్యువే మనముందు సాష్టాంగ పడినంత సంబరపడ్డాం. అణ్వాయుధాలను నమ్ముకున్నాం. అరచేతిలో వైకుంఠం చూసి భ్రాంతి చెందాం.

మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో ఇతర జంతువ్ఞుల నుండి రక్షించు కోవడానికి ప్రకృతి, వైపరీత్యాల నుండి రక్షణకు భద్రతతో కూడిన నివాసం కూడా అంతే అవసరం.

మానవుడు సంఘ జీవి. సంఘంతో సంబంధం లేకుండా మనుగడ సాధించలేడు. కాబట్టి సంఘంలో ఒకడిగా మెసలుతూ, ఆ సంఘాన్ని కాపా డుకోవడం కూడా ముఖ్యమే.

సమాజంతో సంబంధం లేకుండా బతికితే ఎంత దారుణంగా ఉంటుందో, కరోనా అనే భయం కరమైన అంటువ్యాధి మానవ ప్రపంచానికి రుచి చూపించింది.

ప్రతీ వ్యవస్థ మరొక వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. అన్ని రంగాలకు మూలాధారం వ్యవసాయం. తిండి లేకుండా ఈ సకల చరాచరజగత్తు మనుగడ సాగించలేదు.

జీవనాధారం కలిగించే ప్రాధాన్యతా రంగం వ్యవసాయం. పైగా భారతదేశా నికి వెన్నెముక లాంటి విశిష్టరంగం వ్యవసాయం.

అలాంటి తిండి పెట్టే రంగాన్ని నిర్లక్ష్యంతో వదిలేయడం, చిన్నచూపుతో ఈసడించుకోవడం బాధాకరం. వ్యవసాయాన్ని చులకనభావం తో చూడడం మన హ్రస్యదృష్టికి నిదర్శనం.

గ్రామీణ జనవా హిని నగర జనజీవనంతో పోటీపడడంవల్ల గ్రామీణ ప్రాంతా ల్లోని అన్ని వృత్తులు అంతర్ధానమైపోయాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి మానవాళిని అతలాకుతలం చేసింది.కొవిడ్‌-19 సృష్టించిన విలయం వలన అన్ని రంగాలు కుదేలైపోయాయి. ఆర్థిక సంక్షోభం ఏర్పడింది.

ప్రభుత్వాలు తమ ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ప్రజలపై పన్ను ల భారం మోపకతప్పదు.

అయితే ప్రజలు పన్నుల భారం మోసే పరిస్థితిలో లేరు. ప్రజల్లో కొనుగోలు శక్తి సన్నగిల్లింది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో రైతులపై కూడా కనిపించని భారం పడవచ్చు. ప్రభుత్వాలు రైతులపై భారం మోపకుండా, వ్యవసాయానికి ఇతోధికంగా సాయం చేయాలి. వ్యవసాయం సంక్షోభంలో పడితే చాలా ప్రమాదకరం.

ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా కరోనా భయం వెంటాడుతూనే ఉంది.

ఈ పరిస్థితుల్లో ప్రజలకు కావలసింది నిత్యావసర వస్తువ్ఞలు. తినడానికి తిండి, మిగిలిన రంగాలన్నీ అచేతనంగా మారినా వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటే ఆకలి చావ్ఞలను అరికట్టవచ్చు.

కరోనా శకం ఇంకా సమసిపోలేదు. ఎప్పటికీ ఈ మహమ్మారి ఉపశమిస్తుందో అర్థంకావడం లేదు.ఇప్పటికే కరోనా మనకెన్నో గుణపాఠాలు నేర్పింది.

ప్రజలకు నిజమైన అవసరం ఏ రంగం తో ముడిపడి ఉందో అవగతమైనది. శాస్త్రసాంకేతిక రంగాల లోని ప్రగతిగాని, అభివృద్ధికాని కరోనా వలన కలిగిన మాన వ్ఞల కష్టాలను తీర్చలేకపోయింది.

జానెడు పొట్ట నింపుకోవ డానికే జనమంతా ప్రయత్నించారు తప్ప కరెన్సీ కట్టలకోసం తపించలేదు.ప్రపంచం కరోనా కారుచీకట్లో బిక్కుబిక్కుమంటూ బతుకీడ్చుతున్నది.

మనదేశంలో కూడా చాలా రాష్ట్రాలు కరోనా పీడిత రాష్ట్రాలుగా మారిపోయాయి. లాక్‌డౌన్‌లో మినహాయిం పులిచ్చినా ఇప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది.

ఇంకెంత కాలం కరోనాపై పోరాడాలో అవగతం కావడం లేదు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశమైన భారత్‌లో ప్రధానంగా అత్యధికులకు జీవనోపాధి కల్పించేది వ్యవసాయరంగం మాత్రమే.

వ్యవసాయానికున్న ప్రాధాన్యత ఏమిటో ఇప్పటికే ప్రభు త్వాలకు, ప్రజలకు అవగతమై ఉంటుంది.

కరోనా విజృంభిం చిన సమయంలో ప్రజలంతా తిండికోసమే ఎదురుచూసారు తప్ప వేరే విషయాలపై కాదు. భవిష్యత్తులో ఉద్యోగావకాశాల మాట అటుంచి,ప్రస్తుతమున్న ఉద్యోగాలు ఉంటాయో ఊడతా యో తెలియదు.

ఇప్పటికే వీసాల విషయంలో గ్రీన్‌కార్డుల విషయంలో అమెరికా చేస్తున్న ప్రకనటలు భారతీయులకు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి.

దాదాపుగా అన్ని దేశాలు ఇదే బాటలో పయనించే అవకాశాలే మెండు. కాబట్టి మనదేశంకూడా తగు జాగరూకతతో మెలగాలి.

వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరించాలి.ఎంతో ప్రాధాన్యత గల వ్యవసాయరం గాన్ని ఆదుకోవాలి.

బంగరు పంటలతో సస్యశ్యామలమై విరాజిల్లే దేశంలో అన్నదాత పరిస్థితి ఘోరంగా మారింది. అరకొర తాయిలాలతో రైతున్నను ఏమార్చే పద్ధతి మాను కోవాలి.

వ్యవసాయరంగం ఇప్పటికే సంక్షోభంలో కూరుకు పోయింది. తిండిపెట్టే రైతన్న అప్పుల ఊబిలో కూరుకు పోయాడు. ఈ పరిస్థితుల్లో సేద్యం చేసే కృషీవలురకు చేయూత నివ్వడం ప్రభుత్వాల తక్షణకర్తవ్యం.

  • సుంకవల్లి సత్తిరాజు

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/