రెండు భాషలతో రెట్టింపు సృజనాత్మకత !

పిల్లలు -పెంపకం-విజ్ఞానం

Double creativity with both languages!
Double creativity with both languages!

మనసులోని భావాలను అందంగా చెప్పేందుకు, అక్షరాలుగా మలిచేందుకు భాష కావాలి. బాల్యం నుంచే పిల్లలకు మాతృభాషతో పాటు మరొక భాషలో కూడా నైపుణ్యం ఉంటే మరీ మంచిదని
పరిశోధకులు అంటున్నారు.

చిన్నప్పటి నుంచి రెండు భాషలు నేర్చుకున్న పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. కథలు చక్కగా చెబుతారు అంటున్నారు. కెనడాలోని ఆల్‌బెర్జా పరిశోధకులు. అంతేకాదు కథలు చెప్పేటప్పుడు ఒక్కటే భాష వచ్చిన పిల్లలతో పోల్చితే రెండు భాషలు వచ్చిన పిల్లలు ఎక్కువ పదాలు ఉపయోగిస్తారు.

అలానే జ్ఞాపకశక్తి విషయంలో మెరుగ్గా ఉంటున్నారని చెబుతున్నారు. కొత్త విషయాల గురించి ఆలోచించేటప్పుడు రెండు భాషలు వచ్చిన పిల్లలు చురుగ్గా స్పందించడం మేము గమనించాం వారిలో జ్ఞాపకశక్తి, సృజన్మాకత ఎక్కువ.

రెండు భాషల మీద పుట్టు ఉన్న విద్యార్థులకు కథ చెప్పడం తొందరగా అబ్బు తుంది. అలాంటి పిల్లల స్కూలు చదువు, అప్లై ఆందోళన, బెంగ పడాల్సిన అవసరం లేదు అంటున్నారు.

పరిశధకుల్లో ఒకరైన ఎలేనా నికోలాడిన్‌. స్కూల్లో సెకండ్‌ లాంగ్వేజ్‌గా కాకుండా చిన్నప్పటి నుంచే రెండు భాషలు నేర్చుకున్న పిల్లలు ఈ రెండింటిలోఒక్క భాష వచ్చిన పిల్లల కన్నా కథలు చెప్పే సమయంలో ఎక్కువ పదాలు వాడారని పరిశోధకులు గుర్తించారు.