రాష్ట్రంలో అద్భుతమైన మార్పు కన్పిస్తుంది

ktr
ktr

హైదరాబాద్‌: రబీ సీజన్‌లో దేశవ్యాప్తంగా గోధుమలు, ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా పాసవాన్‌ ట్విటర్‌పై మంత్రి కెటిఆర్ స్పందించారు. ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం తెలంగాణ రైతులు, ప్రజానీకం గర్వించదగ్గ సందర్భమన్నారు. ఆరేళ్లలోపే సిఎం కెసిఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో అద్భుతమైన మార్పు కన్పిస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు. దేశంలోంచి 50 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేసినట్టు పాశ్వాన్ తెలిపారు. 50 లక్షల టన్నుల బియ్యంలోతెలంగాణ, ఏపి వాటా 44.36 లక్షల టన్నులు. తెలంగాణ నుంచి 34.36 లక్షల టన్నులు కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. ఏపి నుంచి 10 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/