యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది అజర్‌ అరెస్ట్‌

ప్రేమోన్మాది అజర్ ను ఉరితీయాలి: మహిళ మోర్చ డిమాండ్

వరంగల్ : వ‌రంగ‌ల్ జిల్లా హన్మకొండ గాంధీనగర్‌లో యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది అజర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అజర్‌పై హత్యాయత్నంతో పాటు బెదిరింపు వేధింపులపై పలు సెక్షన్ల కింద కేసు పోలీసులు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇదిలా ఉండగా ప్రేమోన్మాది ఘాతుకంతో గాయపడిన అనూషకు వరంగల్‌ ఎంజీఎంలో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు ప్రేమోన్మాది అజర్ ను ఉరితీయాలని బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు బండరి కల్యాణి డిమాండ్ చేశారు. మహిళ మోర్చ ఆధ్వర్యంలో ఎంజిఎం సెంటర్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ.. ప్రమోన్మాది అజర్ దాడిలో గాయపడిన అనూషకు న్యాయం చేయాలని, అజర్ కు వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. టీఆరెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో విఫలం అయిన హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళపై జరుగుతున్న అత్యాచారలకు టీఆరెస్ ప్రభుత్వం, జిల్లా నాయకులు బాధ్యత వహించాలన్నారు. అనూషకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించి చికిత్స చేయించాలని కళ్యాణి డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/