ముఖానికి కీరదోస

keera
keera

కీరదోసలో 95 శాతం నీరే ఉంటుంది. దీన్ని రోజూ తీసుకుంటే శరీరం తాజాగా ఉంటుంది. పొటాషియం, విటమిన్‌ – ఇ అధికంగా ఉండే కీర వయసు కారణంగా ముఖంపై ఏర్పడ్డ ముడతలను తగ్గిస్తుంది. కీరాలో బ్లీచింగ్‌ లక్షణాలుంటాయి. దీని రసం టోనర్‌లా పనిచేస్తుంది. దీంతో తయారుచేసిన మంచు ముక్కలతో ముఖంపై మృదువుగా రుద్ది కాసేపటి తరువాత చల్లటి నీటితో కడిగేస్తే చాలు. చర్మంపై ఉండే నలుపుదనం తగ్గి ముఖం మెరుస్తుంది. కీర ముక్కలను చక్రాల్లా కోసి కళ్ల మీద పెట్టుకుంటే అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండ వల్ల చర్మం కందిపోయి నల్లగా మారుతుంది. కీరా ముక్కలను ఆ మచ్చలపై పెడితే మార్పు కనిపిస్తుంది.

తాజా జాతీయవ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/