మార్చి 1 నుండి 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌

YouTube video
corona-vaccine-distribute-from-march-1st

న్యూఢిల్లీ: కరోనా నియత్రంణ కోసం దేశలో టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈనేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుండి 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ బుధ‌వారం వెల్ల‌డించారు. అంతేకాదు రెండు, అంత‌క‌న్నా ఎక్కువ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌ 45 ఏళ్ల పైబ‌డిన వ్య‌క్తులకు కూడా ఇస్తామ‌ని చెప్పారు. దేశ‌వ్యాప్తంగా 10 వేల ప్ర‌భుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేష‌న్ సెంటర్ల‌లో వ్యాక్సిన్ వేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వ సెంట‌ర్ల‌లో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామ‌ని స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుప‌త్రులలో వ్యాక్సిన్ వేసుకోవాల‌ని అనుకునే వాళ్లు డ‌బ్బులు చెల్లించాల‌ని జ‌వ‌దేక‌ర్ చెప్పారు. దీనికోసం ఎంత డ‌బ్బు చెల్లించాలో వ‌చ్చే మూడు, నాలుగు రోజుల్లో ఆరోగ్య శాఖ నిర్ణ‌యిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/