మార్చి నుండి శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతి

తిరుమల:కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే ఆర్జిత సేవలకు వచ్చేనెల నుంచి భక్తులను అనుమతించనున్నారు. మార్చి నుంచి భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తామని తెలిపారు. ఈనెల 19న జరుగనున్న రథసప్తమి వేడుకల్లో స్వామివారి వాహనసేవలను తిరుమాడవీధుల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో రథసప్తమి రోజున చక్రస్నానాన్ని ఏకాంతంగా చేపడతామని.. భక్తులకు పుష్కరిణిలోకి అనుమతిలేదన్నారు. రథసప్తమికి సంబంధించి టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమల కొండమీదకు అనుమతిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా ఒకరోజు ముందు టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు.