మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని చాటుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. రీసెంట్ గా తెలంగాణ లో సభ పెట్టి రాహుల్ సక్సెస్ అవ్వగా..ఇప్పుడు ఏపీ ఫై కూడా ఫోకస్ పెట్టారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి రావాలని అధిష్టానం కోరింది. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( పీసీసీ) అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. తెలంగాణ విభజన సందర్భంలో అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా సమైక్యాంధ్ర కోసం పోరాడాడు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ పేరు పెట్టి ఏపీలో పోటీ చేసినా…ఒక్క స్థానం కూడా సాధించలేదు. అయితే ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చే విధంగా కిరణ్ కుమార్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పచెప్పాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. రేపు భేటీ తరువాత దీనిపై క్లారిటీ రానుంది.