భగవంతుని దర్శనం

ఆధ్యాత్మిక చింతన

God's darshan
God’s darshan

భగవంతుడు కనపడుటలేదని మానవులు బాధపడుచున్నారు. భగవంతుడు ఉన్నాడా లేడా ! ఉంటే తప్పక కనబడాలి కదా అని విచారణ చేయుచున్నారు. ఇందుకు కలడు అందురు, ఎందెందు వెదకిచూచిన అందందే కలడని పెద్దలు చెప్పుచుందురు. కలడు కలండనెడివాడు కలడోలేదో యను అనుమానము వలన మానవులకు మనమున కలత చెంది యుండుట తెలియచునేయున్నది. ప్రతి నిత్యం మనం సూర్యుడిని చూస్తున్నాం.

సూర్యునికి మనకు మధ్య ఆకాశమున మేఘము ఏర్పడినప్పుడు మనం సూర్యుడిని చూడలేకపోతి మిగదా అప్పుడువాయువు వచ్చి ఆ మేఘాలను పక్కకు నెట్టివేయుచున్నది. అప్పుడు సూర్యదర్శనం చేయుగలుగుచున్నాం.

ఈ విషయం అందరికి తెలిసినదే. మనకు భగవంతునికి మధ్య అజ్ఞానం ఆవహించబడడం వలన భగవంతుడు మనకు కనబడడం లేదని శాస్త్రం చెప్పుచున్నది. ఈ అజ్ఞానమును జ్ఞానం వలన తొలగినప్పుడు భగవంతుని దర్శనం సిద్ధించునని శాస్త్రం చెప్పుచున్నది.

సూర్యుడు ప్రాతఃకాలమున ఉదయించిన చీకటి కనుమరుగుకాగలదు. అలాగే జ్ఞానం మానవులందు వికసించిన అజ్ఞానం ఇక యుండదు. ఈ ధరణిపై సమస్త ప్రాణికోటి జన్మించి జీవించుచున్నవి. మానవులు కూడ ఈ ప్రాణికోటి యందు ఒక భాగమే వీరును జీవించుచున్నారు.

ప్రాణులకు బుద్ధికోశం లేదు. మానవులకు మాత్రమే బుద్ధికోశం కలదు. మానవులు బుద్దికోశంతో జ్ఞాన వంతులుగాయున్నారు. ఇట్టి మానవులకు అజ్ఞానం ఎలా సంభవించినదని వాపోవుఞచున్నారు. ఈ ప్రకృతి ఈ విధంగా జనించుటకు మూలాధారంగా త్రిగుణములు కారణం.

త్రిగుణములు ప్రకృతి యందు ఉన్నందు వలన ప్రాణులు ప్రకృతి అంశములే కావున త్రిగుణములు మానవ్ఞలందు కలవ్ఞ. కావ్ఞన ఇష్టం అయిష్టం ఇష్టాఇష్టం అను భావన మరియు అహంకారం, స్వార్థం, ఏర్పడినది కావ్ఞన అజ్ఞానమనగా ఇట్టిస్థితి యండుంట యని శాస్త్రం చెప్పుచున్నది.

మానవులు బుద్ధితో ఆలోచించి కర్మలు ఆచరించిన కలుగు ఫలం అనుభవించవలయునుగదా ఇట్టి స్థితి ధర్మసమ్మతం. కర్మలు అహంకారంతో ఆచరించుట కలిగిన ఫలం స్వార్థపరంగా అనుభవించుట, కర్మలకు దాసోహం వలన ఇష్టం అయిష్టం, ఇష్టా ఇష్టం కలిగి యున్నప్పుడు మమకారముచే బంధంగావింప బడియుండుటయే అజ్ఞానం.

ఈ అజ్ఞానం వలన సత్యపదార్థం భగవంతుడు కనబడుటలేదని శాస్త్రం చెప్పుచున్నది. భగవంతునికి పుట్టుకలేదు. రూపం లేదు. నామంలేదు. ఆయన ఎచటయున్నాడో స్థావరం తెలియుట లేదు. భగవంతుడిని దర్శించాలి యని తపన మానవులందు కలుగుచున్నది. భగవంతుని నివాస స్థలం కనుగొనాలంటే జ్ఞానంచే తెలుసుకొనగలం ఇది సత్యం.