బ్రేక్ ఫాస్ట్: అతిగా బ్రెడ్ వద్దు..

ఆహారం.. ఆరోగ్యం..

Breakfast- Don’t want too much bread

చాలా మంది బ్రెడ్ ని ఎంతో ఇష్టంగా తింటారు.. త్వరగా అయిపోయే బ్రేక్ ఫాస్టుల్లో బ్రెడ్ రెసిపీస్ ముందుంటాయి.. అందుకే వీటిని ప్రిపేర్ చేస్తారు.. కానీ, ఇలా తినటం వలన ఆరోగ్యానికి మంచిది కాదని తేలింది.. బ్రెడ్ .. ఈ మాట వినగానే కొంతమంది పేషెంట్స్ తినే తిండి అంటే. మరికొంత మంది బ్రెడ్ ని ఎన్ని రకాలుగా చేసుకునే తినొచ్చని సంతోషపడుతుంటారు. అయితే, ఏది ఏమైనా, త్వరగా తయారయ్యే రెసిపీస్ లో బ్రెడ్ వంటకాలు ముందుంటాయి.. అందుకే క్షణం తీరిక లేని మహిళలు ఉదయాన్నే ఏంటో బ్రేక్ ఫాస్ట్ చేయటానికి ఆసక్తి చూపుతారు..

అయితే, బ్రెడ్ రెసిపీస్ ని ఉదయాన్నే తీసుకోవటం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల , అసిడిటీ సమస్యలు రావటమే కాకుండా, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు.. దీనికి కారణం లేకపోలేదు.. బ్రెడ్ లో గ్లూటెన్ అనే ఆమ్లం ఉంటుంది.. ఇది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. కాబట్టి , ఉదయాన్నే బ్రెడ్ తీసుకోవటం వలన మెదడు పనితీరు తగ్గుతుందని, ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో తప్పకుండా తీసుకోవాలంటే మాత్రం ..ఇది తీసుకున్న వెంటనే పండ్లు తీసుకుంటే సరి అని చెబుతున్నారు.. అయితే, అది కూడా రెగ్యులర్ గా వద్దని చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య విషయాల కోసం ‘నాడి ‘ క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/specials/health1/