ప్రత్యేకహోదా కాగితాలకే పరిమితం

ప్రజావాక్కు

                     ప్రత్యేకహోదా కాగితాలకే పరిమితం

AP
AP

ప్రత్యేకహోదా కాగితాలకే పరిమితం
పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాయిస్తామన్న ప్రభుత్వం హామీని నిలబెట్టుకోకపోవడం వలన కోట్లాది ఆంధ్రు లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 2014 నాటికి ఆంధ్రాలో ముప్ఫై వేలకోట్ల లోటు బడ్జెట్‌వ్ఞంది.పోలవరం, నూతన రాజ ధాని నిర్మాణం కారణంగా ఈ లోటు బడ్జెట్‌ మరింత పెరుగు తూవస్తోంది.వాగ్దానంకార్యరూపం దాల్చకపోవడంతో పరిశ్రమ ల్ని తీసుకురావడానికి అనేకఅదనపు రాయితీలను ప్రభుత్వం ఇవ్వాల్సివస్తోంది.వాహన తయారీ పరిశ్రమకు భూమి కేటా యింపు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం దాదాపు 650 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ప్రతిఏడాది వివిధ పరిశ్రమలకు ప్రభుత్వ భూములు లేనికారణంగా ప్రైవేట్‌భూములు సేకరణ, పన్నురాయితీల ద్వారా ఆరువేల కోట్ల వ్యయం అవ్ఞతోంది. ప్రత్యేక హోదా ఇచ్చి వ్ఞంటే ఈ పరిస్థితి ఉండేదికాదు.
-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

పెరుగుతున్న కాలుష్యం
నగరాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోందని సర్వ త్రా ఆందోళన వ్యక్తమవ్ఞతోంది. దీపావళి సందర్భంలో ఢిల్లీ నగర కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరిందని పత్రికల్లో చద వాం. ఢిల్లీతోపాటు కోల్‌కతా, ముంబాయి, కాన్పూర్‌, హైదరా బాద్‌, చెన్నై లాంటి నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల లో కూడా కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పట్టణీకరణ ప్రక్రియ వేగంగా సాగుతుండటం, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు అధికం కావడం, జనాభా విపరీతంగా పెరుగుతుం డడంతో నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. నగరాలు కాలుష్యా నికి ఇదే ప్రధాన కారణం. దీనికి గ్రామీణప్రాంతాల వారిని నిందించాల్సిన పనిలేదు.
-జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా

పిింఛను శాతం పెంచాలి
విశ్రాంత ఉద్యోగులపై ప్రభుత్వం వివక్ష కనబరుస్తుండడం దురదృష్టకరం. పింఛను శాతం పెంచాలని, వారికి వడ్డీ రేట్లుకనీసం0.5శాతం పెంచాలని,పింఛనుదారులకు ఆదా యపు పన్నుపై ప్రత్యేకరాయితీలు కల్పించాలని, ప్రస్తుతం ఉన్న 60 శాతం కాకుండా వంద శాతం మెడికల్‌ రీయిం బర్స్‌మెంట్‌ సౌకర్యం కల్పించాలని ఎంతో కాలంగా విజ్ఞప్తులు చేస్తున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహ రిస్తున్నాయి.వివాదాస్పదమైన సిపియస్‌ విధానాన్ని పునః సమీక్షించాలని,పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పాతని బంధనల ప్రకారమే పింఛనుచెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీ వలె తీర్పుఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వంపట్టించుకోవడం లేదు.
-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

విద్యార్థుల ఆహారం
మండుటెండల్లో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసు కోవాలి. చల్లదనానికి కూల్‌డ్రింగ్స్‌ను ఆశ్రయించవద్దు. జంక్‌ ఫుడ్స్‌,బయట రోడ్లపై తయారయ్యే ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌ జోలికి వెళ్లవద్దు. అనారోగ్యాన్ని ఆహ్వానించవద్దు. కొబ్బరి బొండాలు, మజ్జిగ, నిమ్మరసం, ఇంట్లో తయారు చేసే పండ్లరసాలను, ఆరోగ్యదాయకమైన ఆహార పదార్థాలనే తీసుకోవాలి. ఈ విష యంలో తల్లిదండ్రుల, పెద్దల శ్రద్ధ మరింత అవసరం.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రా ధాన్యత ఇస్తుంది. 2017-18 సంవత్సరానికి గానుబడ్జెట్‌లో రూ.12,705 కోట్లు కేటాయించింది. గతంలో 2014-15లో సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు రూ. 10,956 కోట్లు, 2015-16 సంవత్సరానికి రూ. 11,216 కోట్లు, 2016-17 సంవత్సరానికి రూ. 10,738 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం విద్యార్థుల సంక్షేమానికి నిధులను పెంచుతూ పోవాలి.
-గుండమల్ల సతీష్‌కుమార్‌, నారాయణపురం

మత మార్పిడులను అరికట్టాలి
భారత దేశం లౌకిక రాజ్యం. ఎవరూ కాదనలేరు. అయితే కొందరు ఇంటింటికీ వెళుతూ మత ప్రచారం చేస్తున్నారు. అందరూ మతం మారితే పర్వాలేదు. ఏ గొడవ ఉండదు. కాని కొందరు మారడం లేదు. ఆ కుటుంబం నుండి విడి పోతున్నారు. ఇలా కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నారు మత చాందసవాదులు. ప్రభుత్వం చట్టాలు చేయాలి. మత మార్పిడులు చేసేవారిని కఠినంగా శిక్షించాలి.
-ఎన్‌.శ్రీధర్‌బాబు, హైదరాబాద్‌

పాదచారులకు సాయం చేయాలి
మహానగరాలలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద పాదచారులు రోడ్లు దాటడానికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఆ పద్మవ్యూహంలో చిక్కితే బయటకు రావడానికి నానా తంటాలు పడుతున్నారు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. అందుకే ప్రతి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద నాలుగువైపుల వాహనాలను ఆపి పాదచారులు రోడ్డు దాటడానికి కొంత సమయం కేటాయించాలి. లేదా అండర్‌ పాస్‌ల ద్వారా పాదచారులు రోడ్డు దాటేందుకు వీలుగా వాటిని నిర్మించాలి.
-ఎస్‌. శ్రీనివాస్‌, హైదరాబాద్‌