ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people
చర్చకు కట్టుబడని రాజ్యసభ:- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

వ్యవసాయ సంబంధిత బిల్లులను కూలంకషంగా చర్చించి దిశ చూపాల్సిన రాజ్యసభ తన బాధ్యతలో విఫలమైంది. జాతిని మరోసారి నిరాశపర్చింది.ముఖ్యమైన విషయాల్లోనూ మొక్కు బడిగా వ్యవహరించి తనప్రతిష్టను మసకబార్చుకొంది. ఇందు లో అధికార,ప్రతిపక్షాలకు దాదాపు సమానమైన వాటా ఉన్న ప్పటికీ,అధికార పక్షానిది ఎక్కువవాటా.రాజ్యసభలో బిల్లులపై లోతైన చర్చలుజరగాలి. భిన్నవాదనలు బలంగా వినిపించాలి. తద్వారా దేశానికి మేలు జరగాలి. చివరలో బిల్లుకు లభించిన మద్దుతు ప్రకారంఅదిచట్టంగా మారాలా,లేదా మరింత లోతైన చర్చకోసం కమిటీకివెళ్లాలాఅన్నది నిర్ణయమవుతుంది. ఒకవైపు పూర్తి మొగ్గు ఉన్నప్పటికీ ముందే తెలిసినప్పటికీ సభ్యుడు అడిగితే లెక్కింపు జరపడం పార్లమెంట్‌ సంప్రదాయం. రాజ్య సభలో బలాబలాలు ఇరుపక్షాలకి దాదాపు సమానంగా ఉండొ చ్చు. ప్రతిపక్షానికి కొంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభ ఉపాధ్యక్షుడు లెక్కింపునకు ససేమిరా అనడం, ముజువాణితో సరిపెట్టడం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధం.

ఆంధ్రలో మండలి ఉన్నట్టా? లేనట్టా?: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి రద్దు చేయాలని అధికార పార్టీ వ్యతిరేకిస్తూ ప్రతిపక్షపార్టీలు శాసనసభలో వాదోపవాదాలు జరిగాయి. ఆధిక్యత ఉన్న అధికార పార్టీ రద్దుకే తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రప్రభుత్వం మండలి రద్దు చేసింది లేనిది నేటి వరకు తెలియదు. ఓ రకంగా చెప్పాలంటే మండలి త్రిశంకుస్వర్గంలో ఉన్నట్టుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం మండలి ఎన్నికలకు ఓటర్లజాబితా సిద్ధం చేయమంటూ హుకుంజారీచేసింది.జాబితా తయారీకి కార్యాల యాలు అధికారులు, సిబ్బంది, టి.ఎ, డి.ఎలు తదితర ఖర్చు లు తడిసిమోపెడవ్ఞతాయి. కావ్ఞన మండలి ఉంటుందో లేదో నిర్ణయించి అనంతరం ఎన్నికలు నిర్వహించాలి.

మాతృభాషపై పట్టు పెంచవచ్చు:-సింగంపల్లి శేషసాయికుమార్‌, రాజంపేట

మాతృభాషపై పట్టు పెంచడానికి,దానిపై ఏకాగ్రత, ఆసక్తి పెంచడానికి ఇప్పుడుమనం అవలంబిస్తున్నమార్గాలకన్నా ఇంకా కొత్త విధానాలను అవలంభించవచ్చు. కేవలం విద్యాపరమైన విధానాలవల్ల మాత్రమే కాకుండాపిల్లలకు ఆనందాన్ని కలిగించే విధంగా తెలుగుపై మక్కువ కలిగించే వివిధ ప్రత్యేక మార్గాల ను అనుసరించవచ్చు.పిల్లలకు ఆటలు,పాటలంటే చాలా ఇష్టపడతారు. వాటి ద్వారా భాషపై సరైన పట్టు కలిపించవచ్చు.

పోలీస్‌ సేవ యాప్‌:-యరమల ప్రతాప్‌రెడ్డి, తిరువూరు,కృష్ణాజిల్లా

పోలీసు సేవ యాప్‌ను దిశా యాప్‌లో సమన్వయం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించిన యాప్‌ పోలీసు వ్యవస్థను మరింత సాంకేతికంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ సేవాయాప్‌ వ్యక్తిగత బ్యాంకింగ్‌ సేవలాగానే వ్యక్తిగత రక్షణ వ్యవస్థగా మారనుంది. ఈ యాప్‌ ద్వారా 12 మాడ్యూల్స్‌ మహిళల రక్షణకు,15మాడ్యూల్స్‌ సైబర్‌ రక్షణకు, ఆరు మాడ్యూల్స్‌ రోడ్డులో మరెన్నో సేవలను అందుబాటులో నికి తీసుకురావడం జరిగింది. ఈయాప్‌ ద్వారా బాధితుడు పోలీసు స్టేషన్‌ను ప్రత్యక్షంగా దర్శించకుండా తన ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. దానిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకో వచ్చు. ముఖ్యంగా ఈ యాప్‌ ద్వారా సామాజిక మాధ్యమంలో వస్తున్నవార్తలు యధార్థమేనా కాదా అనికూడా తెలుసుకోవచ్చు.

కరోనాపై యుద్ధం మరో స్వాతంత్య్ర సమరం: -రమణ అట్లూరి,హైదరాబాద్‌

కరోనానేపథ్యంలో మరోస్వతంత్ర ఉద్యమానికి తెరలేపిన సంద ర్భమిది. 400 సంవత్సరాల బ్రిటిష్‌ వారి పరిపాలన నుండి స్వేచ్ఛను పొందడానికి చేసిన పోరాటం. ఇప్పుడు కరోనా మీద చేస్తుంది ఒకటే. అయితే అది కేవలం భారతదేశానికి మాత్రమే చెందిన విషయం. ఇది మాత్రం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్‌. అప్పుడు దౌర్జన్యంతో నియంతృత్వం రాక్షసత్వంతో నిర్బంధించి మనల్ని బానిసలుగా చేసిన సందర్భం. ఇప్పుడు ఒత్తిడి ఎటువంటి పీడన లేకుండా అతి చిన్న వైరస్‌ ప్రపంచాన్ని తన గుప్పిటలోకి తీసుకోవడం వైచిత్రి. మార్చి నెల నుండి ఇప్పటివరకు నడిచిన మన జీవితపు ఛాయలు ఒకసారి పరికిస్తే ఉప్పు సత్యాగ్రహం, వందేమాతర ఉద్యమం, జాతీయోద్యమం స్థాయిలో లాక్‌డౌన్‌లు నడిచాయి.

మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

రాష్ట్రంలో మహిళాసంఘాలు ఎంతో శ్రమతో, అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాయి.ఈ స్వయంసహయక సంఘాలు ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నా సరైన మార్కెటింగ్‌ విధానం లేనందున ఆర్థికస్వావలంబన సాధించలేకపోతున్నాయి. ఆర్థిక స్వావలంబన కూడా అంతంత మాత్రంగా ఉంది. ఈ సమస్య ను అధిగమించేందుకు ప్రైవేట్‌-ప్రభుత్వం భాగస్వామ్యంతో గ్రామస్థాయిలో షాపులను ఏర్పాటుచేయాలి. ఈసంఘాల ఉత్ప త్తులపై అన్ని రకాల పన్నులను రద్దు చేయాలి. ఒక పటిష్టమైన విధానం అవసరాలకు సరిపడే ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించడం వలన ఎంతో మేలు కలుగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/