ప్రజావాక్కు

Voice ot the people
Voice ot the people


పాలాభిషేకాలు చేయవద్దు: -యర్రమోతుధర్మరాజు,ధవళేశ్వరం

పశుసంపద కొరవడడం, జనాభా పెరగడం, పెరిగిన జనాభా కు పాలఉత్పత్తి లేక దశాబ్దాలకాలంగా పిండి, డబ్బా, ప్యాకెట్‌, కల్తీ పాలతో చంటిపిల్లల నుండి వృద్ధుల వరకు వినియోగిం చడం జరుగుతుంది. అంతంతమాత్రంగా ఉన్న పాల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వాలు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. ఫలితంగా నానాటికీ స్వచ్ఛమైన పాలు ప్రజలకు అందకుండా కల్తీ పాలు సేవించడం మూలంగా లక్షలాది మంది రోగాల బారినపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి, మంత్రుల, ప్రజాప్రతినిధుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయ డంతో మానవాళికి పాలు మరింత దూరం అవ్ఞతున్నాయి. అభిమానం చాటుకునేందుకు ఆ సొమ్ముతో రోగులకు పండ్లు, పేదలకు అన్నదానం అందిస్తే వారి ఆకలి తీర్చడంతోపాటు సంబంధిత నేతలు సంతృప్తిపొందుతారు. పాలు వినియోగిం చనట్లయితే కొంతమందికైనా పాల ఉత్పత్తులు అందించినట్లవ్ఞ తుంది. పాలను నేలపాలు చేసి దుబారా చేయవద్దు.


స్థానిక సమస్యలపై శ్రద్ధ చూపండి: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌,ఆప్ఘనిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన వారికి మన దేశ పౌరసత్వం కల్పించడంలో చూపుతున్న శ్రద్ధ వివిధ మతాల వారికి కులాల వారికి సౌకర్యాలు కల్పించడంలోనూ, ధరలను తగ్గించడంలోనూ,నిరుద్యోగాన్ని, పేదరికాన్ని పారద్రో లటంలోనూ, మందగించిన ఆర్థికవ్యవస్థను చక్కదిద్దటం, మహిళలకు రక్షణ కల్పించడం వంటి వాటిపై చూపడం లేదు. ప్రజలు అభద్రతాభావంతో సతమతమైపోతున్నారు. అలజడు లు ఆందోళనలు, గొడవలతో దేశం అతలాకుతలమైపోతోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ఈ పరిస్థితులకి కారణం.

అభ్యసనం ముఖ్యం: -ఆమంచర్ల ఉష, తిరుపతి

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పిల్లలకు ఎక్కాలు రావడం లేదు. పిల్లలకు హిందీ వర్ణమాల, తెలుగులో అచ్చులు, హల్లులు, లెక్కల్లో ఎక్కాలు, అంకెలు అభ్యాస నం చేయించాలి. లేదా ఎక్కాలను ప్రాజెక్టు వర్కుగా ఇవ్వా లి. ఉపాధ్యాయులు పిల్లల్లో పఠానాస్తిని పెంచేందుకు కృషి చేయాలి. ఆటపాటల ద్వారా పిల్లలకు అభ్యసనం చేయించాలి.ఉపాధ్యాయులేకాకుండా ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల చదువ్ఞసంధ్యల పట్ల దృష్టి పెట్టాలి. అప్పు డే పిల్లలకు చదువ్ఞపై కొంత శ్రద్ధ పెరుగుతుంది.

పెరుగుతున్న దొంగతనాలు: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

రైళ్లు, బస్‌స్టేషన్లలో దొంగతనాలు ఇటీవలి కాలంలో పెరుగు తున్నా వాటి నివారణకు, నియంత్రణకు రైల్వేశాఖ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాది మూడువేలకుపైగా నేరాలు జరగగా 2019 సంవత్సరంలో 3200 కేసులు నమోదు అయ్యాయని నేషనల్‌ క్రైం బ్యూరో గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా వెలుగులోకి రాని కేసులు మరొక 25 శాతం ఉంటాయని, పరిష్కృతమైన కేసులు మొత్తం మీద 15శాతం కూడా మించవన్న సదరు నివే దిక ఆందోళన కలిగిస్తోంది. గొలుసు దొంగతనాలు, చోరీలు, హత్యలు, అత్యాచారాలు, డ్రగ్‌ సరఫరా వంటి కేసులు జరుగు తుండగా ప్రధాన రైళ్లలో అందున ఎసి భోగీలలో ఎక్కువగా జరుగుతున్న వాటిని నియంత్రణకు పటిష్టమైన ప్రణాళికలు చేపట్టకపోవడం బాధాకరం.

విధి నిర్వహణ: -కొవ్వూరు వెంకటేశ్వరప్రసాదరావ్ఞ, ప్రకాశంజిల్లా

గ్రామరెవెన్యూ గణాంకాలలో అతి ప్రాముఖ్యమైన సాగుబడి ఎంతో కీలకమైనది. గ్రామ ప్రతి సర్వే నెంబరు రెవెన్యూ అధికారులు ఫసలీ వారీగా సర్వే కావించి సాగుబడి లెక్కలను నమోదు చేయాలి. రైతువారీగా ఆసామి లెక్కలలో సాగుబడి నమోదు చేయడం వలన సమస్యలు పరిష్కారం అవ్ఞతాయి. విస్తీర్ణం జాబితా విధానంతో స్థలాలను కబ్జా చేయడానికి వీలులేకుండా ఉంటుంది.వచ్చే ఫసలీ నుండి సాగుబడి లెక్క విధి నిర్వహణ కొనసాగించాలి.

నత్తనడకన మేడారం జాతర పనులు: -కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్‌, భూపాలపల్లిజిల్లా

తెలంగాణరాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొంది న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సమయం ఆస న్నమవ్ఞతుంది.ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం లోగల మేడారంగ్రామంలో సమ్మక్క,సారలమ్మజాతర ప్రతి రెండు సంవత్సరాలకోమారు గిరిజనుల సంప్రదాయం ప్రకారం అంగరంగవైభవంగా జరుగుతుంది. ఈసారి మేడా రం జాతరకు రూ.75కోట్లుమాత్రమే కేటాయించారు. జాత రలో భక్తులకు మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఆర్‌.టి.సి, స్నానగదులు, విద్యుత్‌, పోలీసు బందోబస్తు, పారిశుద్ధ్యం, భక్తులు వరసగా వెళ్లడానికి లైన్‌లు వేయడం, ఇతర పనుల కు ఈ నిధులను వినియోగిస్తారు. జిల్లాస్థాయి అధికారులు మేడారం జాతరపనులను వేగవంతంగా నిర్వహించ కుండా నత్తనడకనకొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/