ప్రజావాక్కు: సమస్యలపై ప్రజాగళం

ప్రభుత్వ కార్యాలయాలు: -పూసాల సత్యనారాయణ, హైదరాబాద్‌

ఇరుకురోడ్లపై కనబడికనబడునట్లు అగుపించే ప్రభుత్వ కార్యా లయాలు కోకొల్లలు.పరిశుభ్రత లేని మసిబారిన మరుగుదొడ్లు, సిబ్బంది పేరుఉండదు.హోదా బోర్డ్‌రాసి ఉండదు. శిధిలావస్థ లో ఉన్న కుర్చీలు మేజా బల్లలు కార్యాలయానికి వచ్చినవారు అగమ్యగోచరంలో పడిపోతున్నారు. ఎవరిని సంప్రదించాలో తెలియదు.ప్రజాప్రతినిధులకు కూడాతెలియని ప్రభుత్వ కార్యా లయాలు ఎన్నో ఉన్నాయి.అవి చేసే పనులు కూడా అంతకన్న తెలియదు. ప్రభుత్వం అద్దెకు తీసుకొని మూలకు ముసుగేసు కొని నడిపిస్తున్న తీరు ప్రభుత్వ బీదరికాన్ని ఎత్తిచూపుతున్నా యి. కార్యాలయాలలో మౌలికవసతులు కూడా మృగ్యం. సంబంధిత ఉన్నతాధికారులు డేగ కన్నుతో అన్ని కోణాలలో పరిశీలించి సత్వర చర్యలు చేపట్టినప్పుడు ప్రభుత్వ హుందా తనానికి సత్పరిపాలనకు సంకేతాలిస్తాయి.

సిబ్బంది తొలగింపు: -సి.ప్రతాప్‌,శ్రీకాకుళం

జాతీయరహదారుల వెంబడి పెట్రోలింగ్‌ చేసే వాహనాలలో సిబ్బంది తొలగించి కేవలం డ్రైవర్‌తో మాత్రమే కొనసాగించను న్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. జాతీయ రహదా రులపై ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు ఆటంకంకలగడం ఖాయం. అంతే కాకుండాఅంబులెన్సుల సంఖ్యకూడా తగ్గిపోవడంవలన ప్రమా దం జరిగినప్పుడు సకాలంలో వచ్చి ఆస్పత్రులకు తరలించే సౌలభ్యంతగ్గింది.కొన్నిసందర్భాలలో సెల్‌సిగ్నల్స్‌లేకపోవడం, అంబులెన్సులు దూరంగా ఉండటం వలన ప్రమాదస్థలానికి చేరుకునేందుకు గంట సమయంపట్టి క్షతగాత్రులను ఆదుకోవ డం,తక్షణ వైద్యసహాయం అందించడం కష్టంగా మారింది.

పక్కదారిపడుతున్న పింఛన్లు: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరు జిల్లా


రాష్ట్రంలో పింఛనుదారులందరికీ ప్రతినెల డబ్బు సక్రమంగా అందడమే లక్ష్యంగా ప్రభుత్వం జనవరి నుండి మూడు రోజు ల పింఛను పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయం. ఇప్పటివరకు పింఛను పంపిణీ ఒక తూతూ మంత్రం చందాన మారింది. పదవ తారీఖున వలంటీర్లు మొక్కుబడి చందాన గ్రామాలలో ఇంటిఇంటికి వెళ్లి పింఛన్లు అందించడం, ఆ రోజు న ఇంట్లోలేని వారికి తర్వాత ఇచ్చే సౌకర్యం కల్పించకపోవడం వలన 40నుంచి50శాతం అర్హులకు మాత్రమే పింఛన్లు క్రమం గా పంపిణీ అయ్యేవి. మిగతా వారి పింఛన్లు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు తీవ్రం అయ్యాయి.

 పన్నుల ప్రభుత్వాలు:-డి.చాంద్‌బాషా, కర్నూలు

ాజ్యాలుపోయాయి,రాజరికంపోయి రాచరికం వచ్చింది. ప్రపం చ రాజకీయం ప్రజలు చెల్లించే పన్నులపై ఆధారపడి ఉంది. బ్రిటిషు పరిపాలనతో మొదలైన సుంకం రాజకీయ ప్రయోజనా లకు నాంది అయింది. ప్రస్తుత ప్రభుత్వాలు కేవలం ప్రజల పన్నులతోనేనడుస్తున్నాయి. ప్రజలపై ఆధారపడి నడిచే ప్రభు త్వాలేతప్ప స్వతహాగాసంపాదించే ప్రభుత్వాలు కరవయ్యాయి. రాజకీయస్వార్థం రాజకీయ వ్యవస్థ అభివృద్ధే ధ్యేయంగా నేటి నాయకులు పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను ఉద్ద రించే నాయకులే కరవ్ఞ అవ్ఞతున్నారు. ఎక్కడ చూసినా అవి నీతి, అణచివేత కనపడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించేహక్కులను కూడా కోల్పోతున్నారు. సామాన్య ప్రజలపై పెత్తనం అజమాయిషీ దిశగా ప్రభుత్వాలు పనిచేస్తు న్నాయి.ఆదాయపన్ను, ఆస్తిపన్ను, నీటి పన్ను, సర్వీస్‌ టాక్స్‌, జిఎస్టీ తదితర ఎన్నో పన్నులను ప్రజల నుండి ముక్కుపిండి వసూలుచేస్తున్నారు.

కఠిన చర్యలు చేపట్టాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

దేశ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులకుకారణమైన ప్రపంచీకరణ విధానాలు ఇప్పుడు మనకు ప్రతికూలంగా పరిణమించాయి. మన పారిశ్రామికవేత్తలు చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో అధిక పెట్టుబడులు పెట్టి ఆ వస్తువ్ఞలను తిరిగి మన దేశంలోకి దిగుమతులు చేసేలా ప్రభుత్వ వర్గాలను ప్రభావితం చేస్తున్నారు. చైనాలాంటి దేశాలలో పరిశ్రమలు పర్యావరణ కాలుష్య కారకమవ్ఞతున్నా, కార్మిక చట్టాలకు తిలోదకాలిస్తున్నా అడిగేవారు లేరు. ఇటువంటి విధానాలు వ్యాపార సంస్థలకు లాభదాయకమవ్ఞతుండగా, చౌకగా మార్కెట్‌లో లభిస్తుండడం వలనమనదేశీయ పరిశ్రమలు మూతపడుతున్నాయి. కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి విదేశీ వస్తువ్ఞల దిగుమతులను తగ్గించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి

నిరుద్యోగంపై దృష్టి సారించాలి : -వి.శశిధర్‌, విశాఖపట్నం

నిరుద్యోగంపై పాలకులు తమ దృష్టిసారించాలి. ప్రతి సంవత్స రం కొన్ని లక్షల మంది యువతీయువకులు విద్యను అభ్యసించి వస్తున్నారు.అయినా ఉద్యోగాలులేక, నోవెకన్సీ బోర్డులు దర్శన మిస్తున్నాయి. నిరుద్యోగం వల్ల పేదరికం, నేరాలు పెరిగిపోతు న్నాయి. ఉద్యోగాల పేరిట మోసం, దగా, కుట్రలు పెచ్చుమీరు తున్నాయి.ప్రభుత్వ ఉద్యోగాలైతే దాదాపు లేవనే చెప్పాలి. ప్రైవేట్‌సంస్థలపై ఆదాయపు పన్ను సగానికి తగ్గించాలి.