పోషకాల రాజ్మా తో బోలెడు వెరైటీలు

రుచి: వంటకాలు

Rajma soup

రాజ్మా సూప్:

కావాల్సిన పదార్ధాలు: గింజలు-ఒక కప్పు, సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు-పావుకప్పు, పచ్చి మిర్చి తరుగు-ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి పేస్ట్- ఒక స్పూను, ఉప్పు -తగినంత

తయారు చేసే విధానం:

రాజ్మా గింజలను 6 గంట పాటు నానబెట్టండి.. తర్వాత ఉడికించండి.. ఉడికిన రాజ్మాను మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయండి.. ఒక గిన్నెలో నూనె వేడిచేసి ఉల్లి ముక్కలు , పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించండి.. రెండు నిముషాల తర్వాత టమాటో పేస్ట్ కలపండి.. టమాటో పచ్చి వాసన పోయాక రాజ్మా పేస్ట్, ఉప్పు కలిపి మరో 5 నిముషాలు ఉడికించండి.. సూప్ వడ్డించినపుడు పైన కొద్దిగా తరిగిన చీజ్ లేదా క్రీమ్ వేసి సర్వ్ చేయవచ్చు.

Rajma tikki recipe

రాజ్మా టిక్కీ

కావాల్సిన పదార్ధాలు: ఉడికించిన రాజ్మా- ఒక కప్పు, ఉడికించిన బంగాళా దుంప- చిన్నది, కార్న్ ఫ్లోర్-రెండు టీ స్పూన్లు, పచ్చి మిర్చి తరుగు-ఒక టేబుల్ స్పూను, చాట్ మసాలా-అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, నూనె -తగినంత.

తయారు చేసే విధానం:

ఉడికించిన రాజ్మా, బంగాళా దుంప మెరిపి ముద్దగా చేసి రెండూ కలపండి.. ఈ మిశ్రమానికి పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చాట్ మసాలా, కార్న్ ఫ్లోర్ కలిపి చిన్న చిన్న టిక్కీ లుగా చేయండి.. పెనంలో కొద్దిగా నొనె వేసి టిక్కీలు ఒకదాని పక్క నొకటి ఉంచి రెండు వైపులా కాల్చండి.. వీటిని వేడివేడిగా వున్నపుడే టమాటా సాస్ తో గానీ, స్వీట్ చెట్నీ గానీ తీసుకుంటే బాగుంటుంది.. టిక్కీ లు పెనంపై కాకుండా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు.. లేదా, ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు.

ఆరోగ్య సంబంధిత విషయాల కోసం ‘స్వస్థ ‘ క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/specials/health/