నీ సన్నిధే నా పెన్నిధి

ఆధ్యాత్మిక చింతన: సాయినాథుని లీలలు

Shirdi Sai Baba
Shirdi Sai Baba

సాయిబాబాను దర్శించిన వారిలో కొందరు యోగులున్నారు. జ్ఞానులున్నారు. ఇంకా ఎక్కువగా భక్తులున్నారు. సాయినిగాని ఏ దైవాన్నిగాని సులభంగా చేరుకునేది భక్తి మార్గంలోనే. అయినా భక్తిమార్గం కనిపించినంత సులభం కాదు. సాయిబాబా భక్తులు కృష్ణాజీన్కూలర్‌. పండరీపురంలో సబ్‌జడ్జిగా పనిచేసిన వ్యక్తి. అక్రమార్జన అంటే ఈయనకు తెలియదు. ధర్మబద్ధంగా జీవించిన ఈ న్యాయమూర్తి ‘మొన్న నేను పండరీపుర హారతుల విషయంలో ఇచ్చిన తీర్పే నా తుది తీర్పుకానీయండి అని సాయికి విన్నవించుకున్నాడు. న్కూలర్‌ తన జీవితాన్నంతా సాయి సన్నిధి లోనే గడపాలని ఆశ. అది దురాశకాదు. అలాగే న్కూలర్‌ షీర్టిచేరాడు. చేస్తున్న ఉద్యోగాన్ని పదవీ విరమణ చేశాడు. ఇక ప్రశాంత జీవితమే గదా అని అందరూ అనుకొనవచ్చును. షిర్టీలోనే ఆయనకు వ్యాధి వచ్చింది. ఒక కుమారుడు డాక్టరు కూడా. ఆ డాక్టరు కుమారుడు తండ్రి వైద్యనిమిత్తం షిర్టీకి వచ్చాడు. షిరిడీలోనే మహావైద్యుడైన సాయిబాబా ఉండగా, భౌతిక వైద్యుడు అవసరమా? వ్యాధిని నివారించదలచుకుంటే సాయిబాబా నివారించగలడు. సాయిని వారించనపుడు ఏ డాక్టరు ఏమి చేయ గలడు ?న్కూలరు ప్రతిదినం సాయిబాబా వెండి వనానికిపోయేటప్పుడు, తన కిటికినుండి సాయి దర్శనం చేసుకునేవాడు. భౌతికంగా తాను లేచి, ద్వాకామాయిలోని సాయిని దర్శించలేదు. కనీసం కిటికీగుండా సాయిని దర్శించేంత ఆరోగ్యం కూడా లేదు. మంచానికి అతుక్కుపోయాడు. సాయి దర్శనం కావాలని కుమారునిచే సాయికి కబురు పంపాడు. సంజయునకు కురుపాండవ యుద్ధం కంటికి కనిపించినట్లు, న్కూలర్‌కు ద్వారకామాయిలో సాయిచర్యలు కనపడ్డాయి. ఇంకా, న్కూలర్‌ సాయిపాదోదకాన్ని తెప్పించుకుని త్రాగి, సాయిలో ఐక్యమయిపోయాడు.

రాగం పిచ్చియార్లులు తన సోదరునితో భద్రాది వెళ్లాడు. రాములవారిని దర్శించాడు. రామ భక్తుడైనాడు. రామభక్తునకు కష్టములుండవా? పిచ్చియార్లుల భార్యగతించినది. పిచ్చియార్లుల కుమార్తె గతించినది. ఎంతకు తగ్గని వ్యాధి వచ్చినది. ఆ వ్యాధిచే ఆయన కొల్పలేదు, చేయుచున్న ప్రభుత్వ ఉద్యోగమునకు రాజీనామ సమర్పించినాడు. ఈయన రామ భక్తిని చూచిన పొక్కునూరి దక్షిణామూర్తి అనుదారుడిచ్చి ధన ముతో కిల్లీ కొట్టును (పాన్‌షాప్‌) పెట్టు కున్నాడు. అదియే అతని కుటుంబము నకు ఆధారము. ఒకసారి ఆయన ఇంటిపై ఒక పెద్ద పక్షి వాలినది. అది దుశ్శకు నము అని అందరూ చెప్పారు. పరిహారములు చేయించదలచుకోలేదాయన. తక్కువేమి మనకు రాముడొ క్రడుండు వరకు అనుకీర్తనను పాడుతూ, ఇంటిపై పాలుచల్లినాడు. అంతే, ఈయననే గుంటూరులో సీతారామనా మసంఘ నిర్మాణమునకు పునాది అయినాడు. రామనామసంకీర్తనమేగాక, రామనామకోటిని ఈయన రాసినాడు, వ్రాయించినాడు.రామనామకోటిని, భద్రగిరి ప్రదక్షణముచేసి, రామును ని సంకల్పించి, రామదర్శనముపొందిన ఈయన భద్రదిలోనే తాను ఏర్పరచిన రామనామమును వీనుల వీదుగా వినుచూ, రామనిలో ఐక్యమయినాడు.

  • యం.పి.సాయినాథ్‌

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/