నీటివనరులను సంరక్షించుకోవాలి

water
water

మ నిషి జీవనానికి నీరు అత్యంత ప్రాధాన్యమైనది. మంచి సురక్షిత మంచినీటిపైనే మనుషుల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. జనాభాలో 25శాతం మందికి నీటి లభ్యత జీవన్మరణ సమస్యగా మారింది. తాగు, సాగు నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నమవ్ఞ తోంది. దేశంలో అందుబాటులో ఉన్న నీటిలో 78శాతం వ్యవసాయానికే వినియోగిస్తున్నారు. వ్యవసాయరంగానికి ఉపయోగిస్తున్న నీటిలో 30 శాతం భూ ఉపరితలంలోని చెరువ్ఞలు, నదులు, కాలువల ద్వారా వ్యవసా యానికి ఉపయోగిస్తుంటే 55 శాతం భూగర్భజలాన్ని వాడు తున్నారు. మనదేశంలో వార్షిక వర్షపాతం నాలుగువేల బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు. ఇందులో కొంత ఆవిరైపోగా మిగిలేది 1869 బిసిఎమ్‌. ఈ నీటిలో కొంతభాగం మారుమూల ప్రాంతాలలో ప్రవహిస్తుంటుంది. కనుక దానిని ఉపయోగించలేకపోతున్నాం. మిగిలింది 1123 బిసిఎమ్‌. అందులో 690 బిసిఎమ్‌ ఉపరి తలంలోని వాగులు, నదులలోకి ప్రవహిస్తుంది. మిగతా 493 బిసిఎమ్‌ భూగర్భజాలాల్లోకి చేరుతుంది. ఒకప్పుడు ప్రతివ్యక్తికి 14.180 లీటర్ల నీరు అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు అది 35శాతం తగ్గిపోయి 5,120 లీటర్లకు పడిపోయింది. ప్లానింగ్‌ కమిషన్‌ 2009లో భవిష్యత్తులో మన నీటి అవసరాల పరిస్థితి గురించి చెబుతూ ఇప్పుడున్న నీటివాడకం తీరు ఇలాగే కొనసాగితే 2030 కల్లా దేశంలో సగం మందికి నీరు అందుబాటులో ఉండని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది. 2030 నాటికి నీటి విని యోగం రెండు ట్రిలియన్ల క్యూబిక్‌ మీటర్లకు చేరుకోవచ్చని అంచ నా. పెరుగుతున్న జనాభా ముఖ్యంగా వాతావరణ మార్పులు పెరుగుతున్న నీటి కొరతకు కారణంగా ఉన్నాయి. నీతి ఆయోగ్‌ అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో 40 శాతం మందికి తాగేందుకు నీరుండదు. నీటి అవసరాలు సరఫరా మధ్య వ్యత్యా సాల కారణంగా కరవ్ఞ ప్రాంతాలు పెరిగిపోతున్నాయి. దీని ప్రభా వం మానవ జీవితాలు, జీవనోపాధి, వ్యవసాయాభివృద్ధి ఆహార భద్రత, వ్యాపార స్థిరత్వం మీదపడుతుంది. జనాభా పెరుగుదల, సాంఘిక ఆర్థికాభివృద్ధి, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ మూలంగా నీటి అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచ వనరుల సంస్థ 2019 నివేదిక మేరకు చాలా అధికస్థాయిలో నీటి ఒత్తిడిని ఎదు ర్కొంటూ ఎనిమిదోస్థానంలో ఉన్న సౌదీ అరేబియా ప్రతి వర్షపు నీటిబొట్టును నిల్వ చేయాలని,వచ్చే దశాబ్దకాలంలో నీటి వినియో గాన్ని 43 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాననీటి పరిరక్షణ విభాగాలను ఏర్పాటు చేయాలి.ప్రపంచవ్యాప్తంగా నీటి వినియోగం 1960 నుంచి అధికమైంది. ఫలితంగా నీటి వనరులు నానాటికీ తరిగిపోతున్నాయి. ప్రపంచంలో నాలుగింట ఒకవంతు జనాభా గల 17దేశాలు చాలా అధికస్థాయి నీటి ఒత్తిడిని ఎదు ర్కొంటున్నాయి. నీతి ఆయోగ్‌ 2018 నివేదిక ప్రకారం నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ పదమూడోస్థానంలో ఉంది. చాలా అధికస్థాయి నీటి ఒత్తిడికి గురవ్ఞతున్న 17దేశాల జనాభా కన్నా భారత్‌ జనాభా మూడు రెట్లు అధికం. భూమిపై ప్రకృతి వనరుల్లో భాగమైన జలం సకలజీవజాతికి ప్రాణాధారం. సాగునీటికి, తాగునీటికి జలవనరులు కీలకపాత్ర వహిస్తాయి. రుతుపవనాల అనిశ్చిత, ఉష్ణోగ్రతల్లో మార్పు, జలసంరక్షణపై నిర్లక్ష్యం వహించడం వలన భూగర్భజలాలు అడుగంటి ప్రజలకు నీరందించలేని పరిస్థితిలో బావ్ఞలు, చెరువ్ఞలు, బోర్లు ఎండిపోతు న్నాయి. ప్రబలుతున్న జలసంక్షోభానికి గల ముఖ్యకారణం నేటి నాగరిక మానవ్ఞడు అనాగరికత నీటి వినియోగ పద్ధతులే అనేది నిర్వివాదాంశం.హరిత విప్లవంతో పంటలకు భూగర్భజల విని యోగం బాగా పెరిగింది. భూ ఉపరితల జలం ఆవిరిగా మార డం, తిరిగి వర్షరూపంలో భూమిమీదకు చేరడం తప్ప నీటికి పునరుత్పత్తి లేదు. ప్రతి వాననీటి బొట్టు, వ్యర్థజలాలను శుద్ధి చేసివాడటం, తక్కువ నీటితో పంటలసాగుపై దృష్టిసారించాల్సిన అవశ్యకత ఉంది.నీటి వినియోగంలో పొదుపును ప్రజలు పాటిం చాలి. భూగర్భజలాలను ఇష్టం వచ్చినట్లుగా తోడేస్తున్నాం తప్ప అంతేస్థాయిలో వాటిని పునరుద్ధరించే మార్గాల గురించి ఆలోచించ డం లేదు. వాననీటి సంరక్షణ దేశం నలుమూలలా జలాల విని యోగం, పునర్వినియోగాలకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతముఖ్యమో పకడ్బందీగా అమలుపరచ చడం కూడా అంతకన్నా కీలకం. మన పూర్వీకులు భూమిమీద ప్రవహించే నీటిని నిల్వ చేయడానికి చెరువ్ఞలు తవ్వించారు. నిల్వ ఉంచిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించేవారు. ఇలా చెరువ్ఞల నిర్మాణం జరిగింది. చెరువ్ఞలు వ్యవసాయం, పశువ్ఞల దాహాన్ని, ప్రజల నీటి అవసరాలను తీర్చడమేకాక తీవ్రమైన కరువ్ఞ పరిస్థితు లు వచ్చినప్పుడు తాగడానికి, వ్యవసాయానికి ఉపయోగించేవారు. చుట్టుపక్కల బావ్ఞల్లో నీటి మట్టం పెరగడానికి ఉపయోగపడేవి. చెరువ్ఞలు మనకు సాగునీటి వనరులను మాత్రమే కాకుండా ఎంతో మంది మత్స్యకారులకు జీవనాధారంగా కూడా ఉపయోగపడుతు న్నాయి. నేడు చెరువ్ఞలను పూడ్చి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు మత్స్యకారులకు లేకుండాపోతున్నా యి. నీటి వృధాను అరికట్టడం, కొత్తవనరులను సృష్టించడంపై పాలకులు ప్రజలు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మెరుగైన నీటినిర్వహణ చర్యలద్వారా సమస్యను అధిగమించవచ్చు.భూగర్భ జలమట్టాలు తరిగిపోకుండా పొదుపు పాటిస్తూ నీటిఎద్దడి తలెత్త కుండా కాలుష్యం దాపురించకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవా లి. నీటి పునర్వినియోగానికి,పునరుద్ధరణకు వీలుకల్పించే నిర్మా ణాలను చేపట్టడం నీటికుంటలను, వాటర్‌షెడ్‌లను అభివృద్ధిచేయ డం, భారీ మొత్తంలో మొక్కలు నాటడం,జలవనరుల పరిరక్షణ, వాననీటి సంరక్షణ, సంప్రదాయ జలవనరులైన కుంటలు, చెరు వ్ఞల పునరుద్ధరణ చేపట్టాలి. వాననీరు భూమిలోకి ఇంకిపోయేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భూగర్భజలాలను పునరుద్ధరించ వచ్చు. రైతుల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రతి ఒక్కరిలో నీటి పొదుపు ప్రాణావసరమన్న స్పృహకలగాలి. నీటిఎద్దడి వల్ల రైతాంగం సేద్యంపై పెడుతున్న పెట్టుబడులు వృధా అవ్ఞతున్నా యి. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా 15శాతం మించడం లేదు. రుతుపవనాల రాకలో జాప్యం వచ్చినా ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో సామాన్య ప్రజలతో పాటు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నానాటికీ పెరుగుతున్న నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని మనకున్న సహజనీటి వనరులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.్ద

  • ఆర్‌విఎం.సత్యం

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/