‘నిమ్మగడ్డ’ను తక్షణమే బర్తరఫ్‌ చేయాలి

-ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాని గోవర్థన్‌రెడ్డి

K.Govardhan reddy

Amaravati: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌పై శాసనసభా హక్కుల కమిటీ చైర్మన్‌, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహనిర్భందంలోనే ఉంచాలని ఎలక్షన్‌ కమిషనర్‌ జారీచేసిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడమనేది నిమ్మగడ్డకు చెంప పెట్టులాంటిదని కాకాని వ్యాఖ్యానించారు.

మంత్రులు బొత్ససత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసులు మీద శాసనసభా హక్కుల సంఘం కమిటీ కూడా నిమ్మగడ్డ వ్యహారంపై విచారణకు స్వీకరించామని కాకాని గోవర్థన్‌రెడ్డి వెల్లడించారు. శాసనసభ రాజ్యాంగ వ్యవస్థ, అసెంబ్లీ కోర్టుల పరిధిలోకి రాదు.

అసెంబ్లీ కానీ, ప్రివిలేజ్‌ కమిటీ తీసుకునే నిర్ణయాన్ని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రేపు కోర్టుల్లో కూడా ఛాలెంజ్‌ చేయలేరని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులను అప్పుడు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న సోమనాథ్‌ చటర్జీ తోసిపుచ్చడం జరిగిందని, పార్లమెంట్‌ కానీ, శానసభ కానీ తీసుకున్న సభా నిర్ణయాల్లో జోక్యం చేసుకునే హక్కులు కోర్టులకు లేదని శాసనసభా హక్కుల కమిటీ చైర్మన్‌ గోవర్థన్‌ గుర్తుచేశారు.