నరసారావుపేటలో ప్రత్యేక కార్యాచరణ

15 రోజల తర్వాత కొత్త కేసులు ఉండకూడదనే లక్ష్యంతో చర్యలు

 corona effected place in narasaraopeta
corona effected place in narasaraopeta

గుంటూరు: ఏపిలో కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో గుంటూరు ఒకటి. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 362 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కాగా ఇందులో ఎక్కువగా గుంటూరు, నరసారావు పేట పరిధిలోనే ఉండడంతో అధికారులు ప్రత్యేక చర్యలకు పూనుకుంటున్నారు. గుంటూరు నగరంలో 162 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. నరసారావుపేటలో 163 కేసులు నమోదు అయ్యాయి. దీంతో నరసారావుపేటలో అధికారులు మిషన్‌ 15 పేరిట ప్రణాళికలు రచిస్తున్నారు. 15 రోజుల తర్వాత కొత్త కేసులు ఉండరాదనే లక్ష్యంతో అధికారుల చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఈ నెల 17 వరకు లాక్‌డౌన్‌ యధాతథంగా కొనసాగుతుందని, ఎలాంటి సడలింపులు ఉండవని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 20 కంటైన్‌ మెంట్‌ జోన్‌లు ఉండగా వాటిని 59 క్లస్టర్‌లుగా విభజించారు. ఈ ప్రాంతాలలో ఎలాంటి కార్యకలాపాలకు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/