తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌గా తొలి మహిళ అలేఖ్య

Alekhya
Alekhya Punjala

హైదాబాద్‌: పొట్టి తెలుగు విశ్వవిద్యాలయం తొలి మహిళా రిజిస్ట్రార్‌గా ప్రఖ్యాత అంతర్జాతీయ కూచిపూడి నర్తకీమణి ఆచార్యురాలు అలేఖ్య పుంజాల నియమితులయ్యారు. ఈ మేరకు ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రస్తుత రిజిస్ట్రార్‌ వడ్లకొండ సత్తిరెడ్డి అలేఖ్య పుంజాలకు బాధ్యతులు అప్పగించారు. డిసెంబర్‌ 2వ తేదీకి 32ఏండ్లు  పూర్తి చేసుకుంటున్  తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పటి వరకు 13మంది రిజిస్ట్రార్లుగా పురుషులే చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మహిళ రిజిస్ట్రార్‌ పదవిని చేపట్టడం విశేషం. మాజీ గవర్నర్‌ పి.శివశంకర్‌ కోడలు, ప్రముఖ వైదుయడు విన§్‌ుకుమార్‌ భార్య అయిన అలేఖ్య తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్యశాఖ ఆచార్యురాలుగా 20ఏండ్లుగా కొనసాగుతూ దేశ, విదేశాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించి జాతీయ స్థాయిలో పలు పురస్కారాలను అందుకొని అంతర్జాతీయ కళాకారిణిగా పేరు గడించారు. లలిత కళల పీఠం అధిపతిరాలిగా కొనసాగుతునన అలేఖ్య రిజిస్ట్రార్‌గా నియామకం పట్ల  బోధన, బోధనేతర, నాల్గో తరగతి ఉద్యోగులు ఆమెకు అభినందనలు తెలిపారు. సత్తిరెడ్డి పూర్వశాఖ జర్నలిజం ఆచార్యులుగా కొనసాగుతారు.