తెలంగాణలో మరో రెండు వారాలు లాక్‌డౌన్‌?

లాక్‌డౌన్‌ ను సడలిస్తే కరోనా విజృంభించే అవకాశం

kcr
kcr

హైదరాబాద్‌: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ను పొడగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 7 వరకు ఉన్న లాక్‌డౌన్‌ గడువు మరో రెండు వారాల పాటు పొడగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికి లాక్‌డౌన్‌ ను సడలిస్తే రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉన్నందున మరికొంత కాలం లాక్‌డౌన్‌ను పొడగించాలని కెసిఆర్‌ కు పలువురు సూచించారు. కొత్తగా విధించిన కంటైన్‌మెంట్‌ జోన్‌ల గడువు కూడా ఈ నెల 21 తో ముగియనుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని తెలంగాణలో లాక్‌డౌన్‌ గడువును మరో రెండు వారాలపాటు పొడగించాలన్న ఉద్దేశ్యంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మద్యం షాపుల పునఃప్రారంభం, వలస కార్మికుల తరలింపు, ప్రజా రవాణా, లాక్‌డౌన్‌ సడలిలంపు వంటి అంశాలపై ప్రగతి భవన్‌లో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కేంద్రంలో మాదిరిగా రాష్ట్రంలో కూడా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడగించాలని అధికారులు ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలుస్తుంది. లాక్‌డౌన్‌ సడలింపు, మద్యం విధానం, 7వ తేది తరువాత వ్యూహలపై మంగళవారం నాడు స్వయంగా కెసిఆర్‌ ప్రజలకు వివరిస్తారని అధికారుల సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/